English | Telugu
వెన్నుపోటు పొడిచినా కప్పు అఖిల్ దే అంటున్నాడు
Updated : Apr 27, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయి ఇంటి దారి పట్టారు. శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేష్ విట్టా..ఇలా వరుసగా ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనిమిదవ వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. బిందు మాధవికి దగ్గరవుతున్నాడని గమనించిన అఖిల్ తన సపోర్ట్ తో హౌస్ లో కొనసాగుతున్న అజయ్ కి వెన్నుపోటు పొడిచాడు. తనదో బాండింగ్ లేదని అతన్ని దూరం పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో నామినేషన్స్ ప్రాసెస్ లో అతనికి సరైన ఓటింగ్ దక్కలేదు. అదే అజయ్ ని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేసింది.
హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి రాగానే అందరిలాగే అజయ్.. యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న `బిగ్ బాస్ నాన్ స్టాప్ బజ్` కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. నువ్వు బిందుకు దగ్గరయ్యావని నీకు అఖిల్ దూరమయ్యాడా? అంటూ సూటిగా అజయ్ ని ప్రశ్నించాడు. దీనికి అజయ్ .. ఈ మధ్యే ఆ చర్చ కూడా హౌస్ లో ని సభ్యుల్లో మొదలైందని.. ఈ క్రమంలో ఎందుకు ఆమెతో క్లోజ్ గా వుంటున్నావని అఖిల్ తనని అడుగుతూ వుండేవాడని అసలు విషయం బయటపెట్టాడు.
ఆ తరువాత అఖిల్ వల్లే అజయ్ ఇన్నాళ్లూ హౌస్ లో వుండగలిగాడని, ఇంతకు ముందు ఎలిమినేట్ అయిన వాళ్లు చెప్పారు. ఎప్పుడైతే అఖిల్ కు కొద్ది కొద్దిగా దూరమవుతూ వచ్చావో అప్పుడే నువ్వు ఆడియన్స్ దృష్టిలో వీక్ అవుతూ వచ్చావని రవి అన్నాడు. దీనికి అజయ్ అలాంటిది ఏమీ లేదని సమాధానం చెప్పాడు. ఇక ఇంటి సభ్యుల గురించి మాట్లాడుతూ ..నటరాజ్ మాస్టర్ కొంచెం కంట్రోల్ లో ఉంటే బాగుంటుంది అన్నాడు. శివ స్మార్ట్ గేమ్ ఆడతాడని, అయితే అతని గేమ్ లో విలువలు, ఎమోషన్స్ పక్కన పెట్టేస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక బిందు మాధవిచాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని, కాకపోతే కొంచెం ఓవర్ థింకింగ్ ఆపేస్తే మంచిదన్నాడు. అరియానా ఇప్పడే గేమ్ మొదలు పెట్టిందని అయితే అఖిల్ కప్పు తీసుకురావాలని షాకిచ్చాడు.