English | Telugu
స్టేజ్ పై షణ్ముఖ్ పరువు తీసిన నాగార్జున
Updated : May 2, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ మొత్తానికి ఎండింగ్ దశకు చేరుకుంది. కంటెస్టెంట్ ల అలకలు, ఏడుపులు... గిల్లికజ్జాలతో సాగిన ఈ షో మొత్తానికి చివరి అంకానికి చేరుకుంది. ఇదిలా వుంటే బిగ్‌బాస్ కంటెస్టెంట్ లకు ఈ వారం సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తున్నాడు. ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపి ఇంటి సభ్యులలో ఆనందాన్ని నించాడు. వీక్ ఎండ్ లో బిగ్ బాస్ ఏకంగా ఈ సారి హౌస్ మేట్ ల క్లోజ్ ఫ్రెండ్స్ ని రంగంలోకి దించేశాడు. అంతే కాకుండా పేరెంట్స్, బందువులని కూడా స్టేజ్ పైకి తీసుకురావడంతో ఇంటి సభ్యులు తెగ హ్యాపీ ఫీలయ్యారు.
ఊహించిన వారు స్టేజ్ పై కి రావడంతో ఇంటి సభ్యులు సర్ ప్రైజ్ ఫీలయ్యారు. వారిని చూసి అనందంతో గెంతులేశారు. కొంత మంది మురిసిపోయి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అఖిల్ కోసం సోహైల్ స్టేజ్ పైకి రాగా అఖిల్ గురించి పొగడటం మొదలుపెట్టాడు. దీంతో మధ్యలో దూరిన అరియానా నా గురించి పొడరా అని అడిగింది. దీంతో సోహైల్ .. నేను అన్నీ విన్నాలే.. కూర్చో అన్నట్టుగా పంచ్ వేశాడు. తరువాత అరియానా కోసం అమె సోదరి, దేవి నాగవల్లి, యాంకర్ శివ కోసం అతని ఫ్రెండ్స్ ధనుష్, షణ్ముఖ్ వచ్చారు.
షన్నుని చూసిన నాగార్జున బిగ్ బాస్ తరువాత ఎక్కడా కనిపించడం లేదు అన్నాడు . దీనికి `ప్రిపేర్ అవుతున్నాను సర్ ` ని షణ్ముఖ్ అనగానే..`అంటే బ్రేకప్ తో బిజీగా వున్నావా? అంటూ దిమ్మదిరిగే పంచ్ వేశాడు. . దీంతో ఏం మాట్లాడాలో అర్థం కాక షన్ను సైలెంట్ అయిపోయాడు. ఛాన్స్ దొరికింది కదా అని వెంటనే అషురెడ్డి లేచి దీప్తి ఎలా వుంది అంటూ అడిగేసింది. వెంటనే `అషుకి నోటి దురద` అంటూ షన్ను రిటర్న్ పంచ్ వేశాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. ఆ తరువాతే మిత్ర కోసం సిరి ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.