English | Telugu
అషురెడ్డి పిచ్చిది.. అఖిల్ కు అజయ్ సలహా
Updated : Apr 25, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో ఊహించినట్టుగానే అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇప్పటి వరకు ముమైత్ ఖాన్ నుంచి అజయ్ వరకు ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. అజయ్ ఎలిమినేట్ అని తేలడంతో అషురెడ్డి ఒక్కసారిగా షాక్ కు గురైంది. వున్నచోటే కుప్పకూలిపోయింది. అజయ్ ని పట్టుకుని బోరున ఏడ్చేసింది. ఇక ఎలిమినేట్ అయిన తరువాత స్టేజ్ పైకి వెళ్లిపోయిన అజయ్ ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొ సింబల్ ఇచ్చేశాడు. బ్రోకెట్ హార్ట్..ఫుల్ హార్ట్ లని ఇచ్చేశాడు. అఖిల్, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్, మిత్రా, బిందులకు ఫుల్ హార్ట్ ఇచ్చేశాడు. ఇక మిగతా వాళ్లకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు.
అఖిల్ తనకు వెన్నుపోటు పొడిచినా అజయ్ మాత్రం తనకు ఫుల్ హార్ట్ ఇచ్చేశాడు. అంతే కాకుండా స్ట్రాంగ్ గా వుండు.. అంటూ జాగ్రత్తలు చెప్పాడు. ఇంకా అషు రెడ్డిని చూసుకోమని, తను కొంచెం పిచ్చిదని చెప్పుకొచ్చాడు. తనతో ఎలా పరిచయం మొదలైందో వివరించాడు. ఇదే సందర్భంగా అషురెడ్డిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక ఇంటి సభ్యుల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. నటరాజ్ మాస్టర్ కు కోపం, ప్రేమ సమానంగా వుంటాయన్నాడు. మిత్రా గురించి మాట్లాడిన అజయ్ .. బిందు గురించి అసలు విషయం బయటపెట్టాడు. తను ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోదని.. కానీ నేను అంటే మాత్రం పట్టించుకుంటుందని. డ్రామా తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు.
ఇక బ్రోకెన్ హార్ట్ సింబల్స్ ని అరియానా, అనిల్ , హమీద, శివ, బాబా భాస్కర్ లకు ఇచ్చాడు. అరియానా ఫస్ట్ బాగానే వుంది.. కానీ ఎమోషనల్ గా వీకవుతోందని తను స్ట్రాంగ్ గా వుండాలన్నాడు.. ఇక హమీదా గురించి మాట్లాడుతూ షుగర్ తిను అంటూ కౌంటర్ వేశాడు. చివర్లో బాబా భాస్కర్ గురించి ఓపెన్ అయ్యాడు. మీరు సూపర్ పవర్ ని నా కోసం వాడి వుంటే నేను ఇక్కడ వుండేవాడిని కాదంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అజయ్ జర్నీ ముగిసింది.