English | Telugu

వైఎస్ షర్మిలపై సెటైర్ పేల్చిన అదిరే అభి!

"సుమ అడ్డా" షో నెక్స్ట్ వీక్ ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఇందులో వైస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మీద సెటైర్స్ పేల్చారు. ఈ షోకి  అదిరే అభి, జోర్దార్ సుజాత, విద్యుల్లేఖ, కమెడియన్ సుదర్శన్ వచ్చారు. ఇక సుమ మధ్యలో "మై డియర్ ఈడ స్టూడెంట్స్, మై డియర్ ఆడ స్టూడెంట్స్" అని పిలిచేసరికి  "అసలు స్టూడెంట్స్ ని స్టూడెంట్స్ అని ఎందుకంటారో తెలుసా అండి" అంటూ అదిరే అభి కామెడీ పంచ్ వేసాడు. దానికి జోర్దార్ సుజాత మధ్యలో వచ్చి "వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి" అని రివర్స్ సెటైర్ వేసింది. దాంతో అభి ముఖం వంకరబోయింది.

నిజం చెప్పేసిన వసుధార.. రిషి నమ్మగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -836 లో.. వసుధారని రిషి వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. వసుధార ఇంట్లోకి వెళ్ళాక.. చక్రపాణికి‌ జరిగిందంతా చెప్తుంది. రిషి సర్ ఇంకా కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంది. రిషి సర్ ని కూడా మనం అర్థం చేసుకోవాలని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత వసుధారకి జగతి మెసేజ్ చేస్తుంది. నా కొడుకుని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు వసు. నా వల్ల నువ్వు రిషికి దూరం అయ్యావ్. ఆ రోజు నేను ఉన్న సిచువేషన్ నీకు తెలుసు. నువ్వు అర్థం చేసుకుంటావ్, ప్రేమని మర్చిపోయిన రిషికి నువ్వు ప్రేమని చూపించంటూ జగతి మెసేజ్ చేస్తుంది. వసుధార అది చదివి సైలెంట్ గా ఉంటుంది.

కోపం వస్తే అమ్మా, నాన్న బెడ్ రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంటారు

జీ తెలుగులో ఎన్నో షోస్ వస్తున్నాయి... సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వెళ్లిపోతున్నాయి. ఇక ఇప్పుడు "ఫామిలీ నెంబర్ 1 "పేరుతో ఒక కంప్లీట్ ఫామిలీ ఎంటర్టైనర్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. ఇందులో 8 ఫ్యామిలీస్ మధ్య పోటీలను పెట్టబోతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ వారం వీళ్లందరినీ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల బ్యాక్ గ్రౌండ్ గురించి ఆడియన్స్ కి ఏవి రూపంలో చూపించారు.. మరి ఆ 8 ఫామిలీస్ ఎవరంటే ధన్ రాజ్, ధరణి ప్రియా, కృష్ణ చైతన్యు, కౌశల్, మహేశ్వరీ, హ్రీతేష్, సిద్దార్థ్, శ్రీలలిత ఫామిలీస్ ఈ షోలో ఎంటర్టైన్ చేయబోతున్నాయి. ఇందులో ముందుగా ధన్ రాజ్ ఫామిలీ ఎంట్రీ ఇచ్చింది. ధన్ రాజ్ ఫామిలీని ఇంట్రడ్యూస్ చేయడానికి చమ్మక్ చంద్ర వచ్చాడు.

మూడేళ్ళవుతుంది.. అన్నీ గుర్తున్నాయి.. నా టైం వస్తుంది!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.  అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.

అనిల్ జీల రాసిన మూవీ నిడివి అంతనా! 

అనిల్ జీల హలో వరల్డ్ తో చాలా మంది కి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన  'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.