English | Telugu

వెంట్రుకలతో దూలతీరిపోతుందంటున్న నేహా చౌదరి!

నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితే. స్పోర్ట్స్ రిప్సెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయిన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు.

నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్ళిన నేహా చౌదరి.. అక్కడ సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళింది. అదంతా కలిపి ఒక వ్లాగ్ అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, అవుటింగ్ అంటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి. అయితే ఈ వ్లాగ్స్ ని తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది నేహా చౌదరి.

తాజాగా మరొక వీడీయోని అప్లోడ్ చేసింది నేహా. మళ్ళీ ఒక ఉచిత సలహా ఇవ్వడానికి వచ్చాను. ఉచిత సలహా అంటే మళ్ళీ క్రికెట్ గురించి చెప్తానని అనుకోకండి. ఈ సారి ఇల్లు క్లీనింగ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఎప్పుడు కానీ ఇల్లల్లో కార్పెట్ ఫోర్లింగ్ ఉన్న ఇల్లు మాత్రం తీస్కోకండి. ఒకవేళ తీసుకున్న ఇంత పొడవాటి జుట్టు ఉన్నవాళ్ళు మాత్రం తీస్కోకండి. కార్పెట్ ఫ్లోరింగ్ ఉన్న ఇంట్లో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్.. వామ్మో ఒక వెంట్రుక పడిపోతే క్లీనింగ్ చేయలేక దూల తీరిపోతుంది. అల్రెడీ ఒక డై వ్యాక్యూమ్ పెట్టాను. మళ్ళీ ఇంకొకటి పెట్టాను. అయినా ఆ వెంట్రుక పోవట్లేదు. ఒక్కో వెంట్రుక ఇలా వేళ్ళతో తీయాల్సివస్తుందని నేహా ఆ వీడియోలో చెప్పింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుతున్న నేహా చౌదరి.‌. రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది.