English | Telugu

అన్ ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్న అర్జున్ కళ్యాణ్  వాసంతి కృష్ణన్!

అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమయ్యాడు. శ్రీసత్య అంటే గురించి మాట్లాడితే అర్జున్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ లో శ్రీసత్య వెంటే ఉంటూ.. తనతోనే ఎక్కువ టైం గడిపేవాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ఎంట్రీకి ముందు ఒక వెబ్ సీరీస్ లో యాక్ట్ చేసాడు.. అది కూడా ఎక్కువ పాపులారిటీ రాకపోయేసరికి ఎవరికి ఎక్కువగా తెలియలేదు.  ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీసత్య కోసం తన గేమ్ ని కొన్ని సందర్బాలలో త్యాగం చేసాడు. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కి రావడం కూడా.. శ్రీ సత్య వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అర్జున్ కళ్యాణ్.

డేంజరస్  మూవీ ఓటిటికి ఎప్పుడొస్తుందో చెప్పిన బికినీ భామ

ఆర్జీవీ మూవీస్ చూడడం అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మూవీ తీయడం ఒక ఎత్తైతే..దాని రిలీజ్ కి ముందు చేసే ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. ఆర్జీవీ మూవీ వస్తూనే కాంట్రోవర్సిని వెంటబెట్టుకుని మరీ వస్తుంది. ఎన్నో హిట్ మూవీస్ తీసిన ఆర్జీవీ లాస్ట్ ఇయర్ "డేంజరస్ " అనే మూవీని తీశారు. అది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. నైనా గంగూలి, అప్సరా రాణి కలిసి నటించిన ఈ లెస్బియన్ మూవీలో ఎక్కువ శాతం  అడల్ట్ కంటెంట్ తోనే ఉంటుంది. ఐతే ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యింది కానీ ఇంతవరకు ఓటిటి ప్లాట్ఫారం మీదకు మాత్రం రాలేదు. ఏ మూవీ ఐనా థియేటర్లో రిలీజ్ కాగానే ఒక నెలకో రెండు నెలలకో ఓటిటి మీదకు వచ్చేస్తోంది. కానీ డేంజరస్ మూవీ మాత్రం రిలీజ్ అయ్యి 8 నెలలు అయ్యింది.

బిగ్ బాస్ బిగ్ బాస్ కాంట్రావర్సి షో కాదు...దాని వలన మా జీవితాలే మారిపోయాయి

బీబీ షైనింగ్ స్టార్స్ పేరుతో రీసెంట్ గా స్టార్ మాలో జరిగిన కార్యక్రమం మంచి ఫన్నీఫన్నీగా సాగింది. ఇందులో బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 6 వరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి రకరకాల అవార్డ్స్ ని ప్రకటించి అందించారు. ఇందులో భాగంగా ఆదిరెడ్డి కూడా ఒక అవార్డుని అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మ్యాన్ కేటగిరీలో నెల్లూరు జిల్లా నుంచి ఆదిరెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. ఇక హౌస్ లో గేమ్ చెంజర్ గా ఉన్నాడు. ఈ షోలో కూడా "గేమ్ చెంజర్ " క్యాటగిరి కింద అవార్డుని అందించారు. అవార్డు తీసుకున్న ఆది మాట్లాడాడు.  "అందరికీ చాలా ధన్యవాదాలు. నా లైఫ్ మొత్తం అందరికీ రుణపడి ఉంటాను. చాలామంది బిగ్ బాస్ ని ఒక కాంట్రవర్షియల్ షోగా చూస్తారు కానీ..కొన్ని వందల మందికి ఇది లైఫ్ ఇచ్చి, లైఫ్ మార్చిన షో అనే విషయాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారు.. ఇక్కడ ఉన్న 100 మందికి పైగా జీవితాలను ఈ షో మార్చేసింది.

మణికొండ ఇల్లంటే ఒక వైబ్...కానీ అమ్మక తప్పడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న జ్యోతక్క

శివజ్యోతి అలియాస్ జ్యోతక్క మణికొండలో తన ఇంటిని అమ్మేస్తున్నట్టు చెప్పి ఎమోషనల్ అయ్యింది. రీసెంట్ గా తన ఛానల్ లో అప్ లోడ్ చేసిన ఒక హోమ్ టూర్ వీడియోలో ఈ విషయాన్ని చెప్పింది శివజ్యోతి. మణికొండలో ఉన్న ఆ ఇంటి వలన తనకు ఎంతో లాభం కలిగిందని.. ఆ ఇంట్లో అడుగుపెట్టాకే  కలిసొచ్చింది చెప్పింది. ఈ ఇంట్లోకి వచ్చాకే అవకాశాలు కూడా బాగా వచ్చాయంది. ఈ ఇల్లు చూపించినంత సక్సెస్, లవ్, గుర్తులు ఇంక ఏదీ ఇవ్వలేదు. ఐతే ఈ ఇంట్లో ఉన్నప్పుడే ఒక ఛానల్ ని స్టార్ట్ చేసింది జ్యోతక్క.. అది మూడు నెలలైనా పెద్దగా క్లిక్ అవ్వకపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్లిపోయిందట. ఇంకా ఇతరత్రా కారణాల వలన ఆ ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నట్లు చెప్పింది.

ఢీలో పుట్టినరోజు వేడుకలు..కంటెస్టెంట్ బర్త్ డే డిసైడ్ చేసి విషెస్ చెప్పిన శేఖర్ మాష్టర్

ఢీ షోలో మంచి డ్యాన్సులు చూసాం, మంచి స్కిట్స్ కూడా చూసాం..కానీ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ని ఈ వారం షోలో చూడొచ్చు. ఈ డాన్స్ జోడీస్ లో సైరా రాయలసీమ టీమ్ మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ప్రతీ వారం అలరిస్తూ ఉంటుంది. ఇందులో రాజశేఖర్, సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ వారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ప్రదీప్ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసేలా చేసాడు.. వాళ్ళను స్టేజి మీదకు పిలిచి వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అడిగాడు. "ఒక కాంపిటీషన్ లో ఇద్దరం కలిసాం .. ఢీ 14 , 15 లో కూడా ఆడిషన్స్ ఇచ్చాము ..ఐతే సెలెక్ట్ కాకపోయేసరికి మన ఫేస్ వల్ల మనం సెలెక్ట్ కావట్లేదని అనుకున్నాం. కానీ ఇప్పుడు అది అబద్దం అని తెలిసింది.. ఢీ 16 స్టేజి మీద ఈరోజు నిలబడ్డాం.

పెళ్ళి తర్వాత మొదటిసారి వచ్చిన గౌతమ్, నందు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -225 లో.. భవాని సిద్ధాంతి గారు రాగానే.. రేవతిని తప్ప మిగత అందరూ ఇక్కడ నుండి వెళ్ళండని చెప్తుంది. కృష్ణ, మురారి గురించి సిద్ధాంతికి భవాని చెప్తుంది. అలా మంగళ సూత్రం తెగిపోయింది, దీని వళ్ళ ఏమైనా జరుగుతుందా అని అడుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండటానికి ఏం చెయ్యడానికైనా సిద్ధమని భవాని చెప్తుంది. అలా జరగడం అనుకోకుండా జరిగింది. అంతే గాని దానివల్ల ఎవరికేం కాదని సిద్ధాంతి చెప్తాడు. వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలంటే మీరు రేపు పూజ జరిపించాలని సిధ్ధాంతి చెప్తాడు.