English | Telugu

పుట్టింట్లో కావ్య చేసే పని బ్రేకింగ్ న్యూస్ అవ్వనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -169 లో.. రాహుల్ డ్రింక్ చేసి వచ్చి స్వప్నతో బాగా మాట్లాడేసరికి.. ఈ రోజు రాహుల్ డ్రింక్ చేసి ఉన్నాడు ఎలాగైనా నా సొంతం చేసుకొని, లేని కడుపుని నిజం చేసుకోవాలని స్వప్న అనుకుంటుంది.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం రాహుల్ లేచేసరికి స్వప్న రాహుల్ గుండెలపై పడుకొని ఉండేసరికి రాహుల్ షాక్ అవుతు.. స్వప్నని పక్కకి నెట్టివేస్తాడు. ఏమైంది రాత్రి అని అడుగుతాడు. స్వప్న సిగ్గుపడుతు మనకి రెండవ సారి శోభనం జరిగిందని స్వప్న చెప్పగానే.. రాహుల్ చిరాగ్గా రాత్రి తాగేసి వచ్చి దీని మాయలో పడిపోయినట్టున్నానని రాహుల్ కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను అనుకున్నది జరిగింది. ఇక నేను నెల తప్పితే ఈ ఇంట్లో నాకు తిరుగుండదని సంబరపడుతుంది. మరొక వైపు కావ్య రెడీ అయి రాజ్ దగ్గరికి వస్తుంది. నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. నేనేం మీ ఇంటి డబ్బులు మా ఇంటికి ఇచ్చి రావడానికి వెళ్లడం లేదని కావ్య అంటుంది. నేనలా ఎప్పుడు అనలేదని రాజ్ అంటాడు. నిన్న మీ అమ్మగారు అన్నారు కదా అని కావ్య అంటుంది. నిన్న అంత గొడవ జరిగింది. మళ్ళీ ఎందుకు మీ ప్రాబ్లమ్ క్లియర్ అయింది కదా అని రాజ్ అంటాడు. సమస్య అలాగే ఉంది. మా నాన్నకి హెల్ప్ చేస్తాను. మా షాప్ లో వర్క్ చేయడానికి వెళ్తున్నానని కావ్య చెప్తుంది. నువ్వు ఈ ఇంటి కొడలు.. షాప్ లో వర్క్ చేయడమేంటి. మన కంపనీలో పని చెయ్యమని చెప్పాను కదా అని రాజ్ అంటాడు. నేను ఎందుకు చెయ్యలేనో మీకు నిన్న చెప్పానని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. వాళ్ళ మాటలు విన్న రాహుల్ కావ్య ఇంత పెద్ద ఇంటికి కోడలు అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్లి పని చేస్తుందా? ఇది పెద్ద న్యూస్ అని మంచి ఛాన్స్ దొరికిందని రాహుల్ అనుకుంటాడు.

మరొకవైపు కృష్ణమూర్తి దగ్గరికి శ్రీనివాస్ వెళ్లి కాంట్రాక్ట్ కి సంబంధించిన అడ్వాన్స్ ఇస్తూ కావ్య వస్తుందని చెప్తాడు. కావ్య ఇక్కడకి వచ్చి ఎలా వర్క్ చేస్తుంది. తను వస్తానన్న అన్న నేను వద్దంటానని కృష్ణమూర్తి అంటాడు. అప్పుడే కావ్య వచ్చి అడ్వాన్స్ తీసుకోండి నాన్న అని నచ్చజెప్పి అడ్వాన్స్ తీసుకునేల చేస్తుంది. మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ కావ్య ఎక్కడ అని అడుగుతారు. అపర్ణ కొప్పుడుతుందని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మకి బాగోలేదని చూడడానికి వెళ్ళిందని రాజ్ కవర్ చేస్తాడు. మరొక వైపు కావ్య తన కుటుంబంతో కలిసి బొమ్మలు తయారు చెయ్యడానికి అంతా సిద్ధం చేస్తూ.. సరదాగా గడుపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.