English | Telugu

నిజం చెప్పేసిన వసుధార.. రిషి నమ్మగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -836 లో.. వసుధారని రిషి వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. వసుధార ఇంట్లోకి వెళ్ళాక.. చక్రపాణికి‌ జరిగిందంతా చెప్తుంది. రిషి సర్ ఇంకా కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంది. రిషి సర్ ని కూడా మనం అర్థం చేసుకోవాలని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత వసుధారకి జగతి మెసేజ్ చేస్తుంది. నా కొడుకుని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు వసు. నా వల్ల నువ్వు రిషికి దూరం అయ్యావ్. ఆ రోజు నేను ఉన్న సిచువేషన్ నీకు తెలుసు. నువ్వు అర్థం చేసుకుంటావ్, ప్రేమని మర్చిపోయిన రిషికి నువ్వు ప్రేమని చూపించంటూ జగతి మెసేజ్ చేస్తుంది. వసుధార అది చదివి సైలెంట్ గా ఉంటుంది.

మరొకవైపు రిషి ఎటాక్ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే రౌడీ వదిలేసిన ఫోన్ కి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. రిషి లిఫ్ట్ చేసేలోపే ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఆ తర్వాత రిషి ఇన్‌స్పెక్టర్ కి ఫోన్ చేసి కలవాలని అంటాడు. సరే వస్తున్నా అని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. మరొక వైపు శైలేంద్ర రౌడీ ఫోన్ స్విచాఫ్ వస్తుందని కోపంగా ఉంటాడు. అప్పుడే ధరణి కాఫీ తీసుకొని వచ్చి శైలేంద్రకి ఇస్తుంది. శైలేంద్ర కోపంగా కాఫీ కప్ ని కింద పడేస్తాడు. అప్పుడే ఏం జరిగిందని ఫణింద్ర వస్తాడు. శైలేంద్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని, రోజు రోజుకి నీ పనులు చిరాకు తెప్పిస్తున్నాయని శైలేంద్రపై కోప్పడతాడు ఫణీంద్ర. అయన తప్పేం లేదు మామయ్య నా చేతిలో నుండి పడిపోయిందని ధరణి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఎందుకు అబద్ధం చెప్పావ్ ధరణి అని జగతి అడుగుతుంది. మామయ్య గారికి అయన బయపడతాడు. అలా ఇప్పుడు మామయ్య గారు ఏదైనా అంటే ఆవేశంగా నిజం మాట్లాడతాడు. అందుకే అని ధరణి అంటుంది.

మరొకవైపు రిషి కోసం ఇన్‌స్పెక్టర్ కాలేజీకి వస్తాడు. వసుధార ఇన్‌స్పెక్టర్ ని చూసి మీరు ఇక్కడ ఏంటి అని అడుగుతుంది. రిషి సర్ రమ్మన్నాడని చెప్పగానే వసుధారనే ఇన్‌స్పెక్టర్ ని రిషి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. రిషి దగ్గరికి వెళ్ళాక.. నిన్న నైట్ మళ్ళీ ఎటాక్ జరిగింది. ఈ ఫోన్ రౌడీ వదిలేసి పారిపోయడు. ఈ ఫోన్ కి మార్నింగ్ ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసే సరికి స్విచాఫ్ అయింది. మళ్ళీ కాల్ చేస్తారని వెయిటింగ్ అని రిషి చెప్తాడు. అప్పుడే రిషి కి ఫోన్ వస్తే బయటకు వెళ్తాడు. రౌడీకి శైలేంద్ర ఫోన్ కాల్ చేస్తాడు. ఇన్‌స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పనిపూర్తి అయిందా అని శైలేంద్ర అడుగుతాడు. శైలేంద్ర వాయిస్ విన్న వసుధార షాక్ అవుతుంది. ఇన్‌స్పెక్టర్ ఎవరని అడగగానే.. శైలేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే రిషి వస్తాడు. ఎవరో ఫోన్ చేశారు సర్.. మేడమ్ ఆ వాయిస్ మీరు గుర్తు పట్టరా అని ఇన్ స్పెక్టర్ అడుగుతాడు. ఎవరు మేడమ్ గుర్తు పట్టరా అని వసుధారని రిషి అడుగుతాడు. మీ అన్న శైలేంద్ర వాయిస్ అని వసుధార చెప్పగానే.. రిషి షాక్ అవుతాడు. మేం ఆ రోజు అలా అబద్ధం చెప్పడానికి కారణం కూడా మీ అన్నయ్య అని వసుధార చెప్తుంది. మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మా అన్నయ్య మీద నింద వేస్తున్నారని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.