English | Telugu

ఇంటి పరువు తీసిందని‌ కావ్యపై దుగ్గిరాల ఫ్యామిలీ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -170 లో.. కావ్య తన పుట్టింట్లో వర్క్ చేస్తున్న వీడియోని రాహుల్ కి తన మనిషి పంపిస్తాడు. అది చూసిన రాహుల్.. ఈ వీడియోని ఎలాగైనా మీడియాలో వచ్చేలా చెయమని చెప్తాడు. అప్పుడే రుద్రాణి వచ్చి ఆ వీడియో చూపించమని అడుగుతుంది. ఆ వీడియో చూసిన రుద్రాణి.. ఈ వీడియో మీడియాలో వచ్చేలా నువ్వు చెయ్.. ఇంట్లో యుద్ధం నేను మొదలుపెడతానని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది.

మరొకవైపు కళ్యాణ్ తన అభిమాని పేరు కనుక్కోవాలని అప్పుతో చెప్తాడు. నా అభిమాని పేరు క్లూ ఇచ్చింది చేతిలో ఉంటుందట. నువ్వు చెప్పమని అప్పుతో కళ్యాణ్ అంటాడు. నాకేం తెలియదని అప్పు అంటుంది. మరొక వైపు ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతుంటే.. రుద్రాణికి ప్లాన్ సక్సెస్ అని రాహుల్ సైగ చేస్తాడు. దాంతో రుద్రాణి టీవీ ఆన్ చేస్తుంది. కావ్య తన పుట్టింట్లో వర్క్ చేస్తున్న వీడియో న్యూస్ లో వస్తుంది.ఇంట్లో వాళ్ళు అందరూ అది చూసి షాక్ అవుతారు. దుగ్గిరాల ఇంటి కోడలు దయనీయ స్థితిలో ఉంటుంది. ఆ ఇంట్లో మానవత్వం కరువయి, ఆ ఇంటి కోడలు పుట్టింట్లో తన నాన్న షాప్ లో పని చేస్తుందంటూ న్యూస్ లో రావడం చూసిన అపర్ణ కోపంగా టీవీ ఆఫ్ చేస్తుంది. చూసారా మన ఇంటి పరువు ఎలా తీస్తుందోనని అపర్ణ అంటుంది. అసలు ఆ మీడియా కవరేజ్ కూడా కావ్య చేపించిదేమోనని రుద్రాణి అనగానే.. రానివ్వండి తన సంగతి చెప్తానని అపర్ణ అంటుంది. మరొక వైపు కళ్యాణ్ తన అభిమాని పేరు కనుక్కోవడం కోసం కష్టపడుతుంటాడు కళ్యాణ్మ అప్పుడే షాప్ అతను కళ్యాణ్ నీ పిలిచి మీకు ఫోన్ వచ్చిందని చెప్తాడు. కళ్యాణ్ వెళ్లి ఫోన్ మాట్లాడుతాడు. నేను మీ మాటలు విన్నానని కళ్యాణ్ అభిమని మాట్లాడుతుంది. మళ్ళీ క్లూ ఇస్తుంది. కళ్యాణ్ తన పేరు అనామీకా అని కనిపెడతాడు. మీ నెంబర్ చెప్పండని కళ్యాణ్ అనగానే.. పక్కన ఉన్న అప్పు.. కళ్యాణ్ ని అదోలా చూస్తుంది. కానీ ఆ అభిమాని ఫోన్ నెంబర్ చెప్పి ఒక నెంబర్ కనుక్కోమని మళ్ళీ చెప్తుంది.

మరొకవైపు రాజ్ కి కావ్య చేస్తున్న వర్క్ మీడియాలో వచ్చిన విషయం తెలుస్తుంది. రాజ్ కోపంగా బయల్దేరతాడు. మరొక వైపు కావ్య కూడా తన పుట్టింటి నుండి బయల్దేరుతుంది. తర్వాత కావ్య ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లో సైలెంట్ గా కూర్చొని ఉంటారు. ఏమైందని కావ్య అడుగుతుంది. ఏమైంది అని తెల్వదా అని రుద్రాణి వీడియో చూపిస్తుంది. అందులో తప్పేముంది.. కష్టంపడడం తప్పు కాదు.. మీరు పరువు చూస్తున్నారు.. నేను కష్టం చూస్తున్నానని కావ్య అంటుంది. అలా కావ్య అనడంతో తనపై కోప్పడుతుంది అపర్ణ. అప్పుడే రాజ్ వస్తాడు. రాజ్ కూడా కావ్యనే తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.