English | Telugu

మూడేళ్ళవుతుంది.. అన్నీ గుర్తున్నాయి.. నా టైం వస్తుంది!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.

బిబి జోడీలోని మొదటి రెండు వారాల్లో అఖిల్-తేజస్విని వాళ్ళ హాట్ పర్ఫామెన్స్ తో జడ్జ్ లకే చెమటలు పట్టించారు. అయితే ఆ షోలో విన్నర్ గా వీళ్ళ జోడి నిలుస్తుందని అనుకున్నారంతా కానీ అనుకోకుండా అఖిల్ కాలికి గాయం కారణంగా డాక్టర్స్ డ్యాన్స్ చేయకూడదని చెప్పడంతో వాళ్ళ జోడీ షో నుండి బయటకొచ్చేసింది. అఖిల్ సార్థక్ ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటు వస్తున్నాడు. ఏ విషయమైన బోల్డ్ గా మొహమాటం లేకుండా అడిగేస్తున్నాడు. నాకొక రిలేషన్ కావాలంటు తన కోరికని ఓపెన్ గా చెప్పిన అఖిల్ సార్థక్ అప్పట్లో వైరల్ గా మారాడు. ఆ తర్వాత లవ్వు, కొవ్వు అంత తగ్గిస్తానంటూ మోనాల్ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా అఖిల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసాడు. ఫ్రెండ్ షిప్ డే రోజు తనకి విషెస్ గురించి ఘాటుగా స్పందించాడు. " నేను కొన్ని సార్లు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఫ్రెండ్ షిప్ డేకి గుర్తుకొస్తామా? ఎప్పుడు గుర్తుకురామా.. మేం కాల్ చేసినప్పుడు లేపని రోజులు లేవా? చెప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చిన రోజులు ఉన్నాయి. మీ పనులు మీరు చేసుకొని వెళ్ళిపోతున్నారు. సడన్ గా ఫ్రెండ్ షిప్ డే రోజు విషెస్ చెప్తే .. నేను ఫూల్ నా? వేరే భాషలో మాట్లాడితే నాకు అర్థం కాదనుకున్నావా? మూడేళ్లు అవుతుంది. అన్నీ చూస్తున్నా. జస్ట్ వెయిట్ మై టైం" అంటూ అఖిల్ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా మోనాల్ ని ఉద్దేశించి చెప్పాడని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి మోనాల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.


Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.