English | Telugu

వైఎస్ షర్మిలపై సెటైర్ పేల్చిన అదిరే అభి!

"సుమ అడ్డా" షో నెక్స్ట్ వీక్ ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఇందులో వైస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మీద సెటైర్స్ పేల్చారు. ఈ షోకి అదిరే అభి, జోర్దార్ సుజాత, విద్యుల్లేఖ, కమెడియన్ సుదర్శన్ వచ్చారు. ఇక సుమ మధ్యలో "మై డియర్ ఈడ స్టూడెంట్స్, మై డియర్ ఆడ స్టూడెంట్స్" అని పిలిచేసరికి "అసలు స్టూడెంట్స్ ని స్టూడెంట్స్ అని ఎందుకంటారో తెలుసా అండి" అంటూ అదిరే అభి కామెడీ పంచ్ వేసాడు. దానికి జోర్దార్ సుజాత మధ్యలో వచ్చి "వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి" అని రివర్స్ సెటైర్ వేసింది. దాంతో అభి ముఖం వంకరబోయింది. ఇక స్టార్టింగ్ లో అదిరే అభి సుమ మీద పంచులు వర్షం కురిపించేసరికి సుమ తెగ సిగ్గుమొగ్గలైపోయింది.

"మీరు ఎందుకు ఈమధ్య హీరోయిన్ త్రిష గారిలా కనిపిస్తున్నారు" అని అభి సుమని అడిగాడు .."నువ్వెంత ఐస్ వేసినా పాయింట్ పాయింటే" అని విద్యుల్లేఖ అభికి కౌంటర్ వేసింది. "ఆయన ఐస్ వేసాడు కాబట్టే నేను త్రిషలా కనిపిస్తున్నా" అని కామెడీ కౌంటర్ పేల్చింది సుమ. దాంతో "అనవసరంగా వేసానండి పంచ్" అని ఫీలయ్యాడు అభి. "సుజాత మీ ఆయన బాగున్నాడా" అనేసరికి "చాలా బాగున్నాడు" అని చెప్పింది. "మీకు తెలుసా రాకేష్ ని ఎన్ని సార్లు పెళ్లి గురించి అడిగినా నేను చేసుకోను..కానీ చివరికి చేసుకున్నాడు" అని అంది సుమా.. ఇక ఈ ప్రోమోలో స్టూడెంట్ మీద డైలాగ్ చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "ఇక్కడ కూడా షర్మిల అక్కను వదల లేదుగా..." అని అంటున్నారు. ఇక అదిరే అభి రిఎంట్రీ ఇవ్వడం పై నెటిజన్స్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.