English | Telugu
ఈ షూటింగ్ అంటే చాలు గుండెలు వణుకుతాయి!
Updated : Aug 10, 2023
టీవీ రంగంలో జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, వేణు ఎల్దండి, అటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర, శకలక శంకర్ ఇలా చాలామంది జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశాలను పొందుతున్నారు. అదే బాటలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కూడా ఫేమస్ అయ్యారు.
జోర్దర్ సుజాత తనకంటు సొంతంగా ' సూపర్ సుజాత' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంది. కాగా ఆ వ్లాగ్స్ అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో మొదటి నుండి పిల్లలతో ఎక్కువగా స్కిట్లు చేస్తూ ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత వీళ్ళ టీమ్ లోకి జోర్దార్ సుజాత వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. రాకింగ్ రాకేష్ సొంతంగా ' చంటబ్బాయ్' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశాడు. అందులో వీళ్ళిద్దరు కలిసి అమెరికా, యూకే వెళ్తున్న వ్లాగ్స్ చేశారు. అవి వైరల్ అయిన విషయం తెలిసిందే. పాస్ పోర్ట్స్ పోయాయంటూ సుజాత మీద ఫ్రాంక్ చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అయింది.
తాజాగా రాకింగ్ రాకేష్ తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోని అప్లోడ్ చేశాడు. అందులో వాళ్ళు జబర్దస్త్ స్టేజ్ మీద చేసే పది నిమిషాల స్కిట్ కోసం ఎంత కష్టపడతారో చెప్పాడు రాకేష్. ఈ వీడీయోకి ' ఈ షూటింగ్ అంటే చాలు గుండెలు వణుకుతాయి' అనే టైటిల్ పెట్టగా, తంబ్ నెయిల్ లో రాఘవేంద్రరావు, హైపర్ ఆది, గెటప్ శీను, సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లని ఆడ్ చేయడంతో చాలా మంది ఏం ఉందా అని చూస్తున్నారు. అయితే ఈ వీడియోలో తన టీమ్ అంతా స్కిట్ చేసే రెండు రోజుల ముందు నుండి ప్రాక్టీస్ చేస్తున్నట్టు రాకేష్ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.