English | Telugu

అఖిల్ కాకపొతే నిఖిల్..గతంతో నాకు పని లేదు

బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ షో "నీతోనే డాన్స్" ప్రతీవారం శని, ఆదివారాల్లో మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంటోంది. బీబీ జోడిని తలదన్నేలా ఉంటున్నాయి ఈ షోలోని డాన్స్ పెర్ఫార్మెన్సెస్..నీతోనే డాన్స్ షోలో బీబీ జోడిని ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇక వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈ వారం వాళ్ళను కూడా తీసుకొచ్చారు. నిఖిల్-కావ్యకి జోడీగా తేజస్విని మాదివాడ ఎంట్రీ ఇచ్చింది. బీబీ జోడిలో తేజు-అఖిల్ జోడి చేసిన రచ్చని ఇప్పటికీ ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేదు. ఆ హాట్ డాన్స్   స్టెప్స్ ఇంకా గుర్తున్నాయి. జడ్జి రాధ ఐతే ఈ జోడి చేసే  పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఐపోయేవారు.

ట్రెండింగ్ లో షణ్ముఖ్ 'స్టూడెంట్ యాంథమ్' సాంగ్!

కాలేజ్ లైఫ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏ స్టోరీ అయినా దాదాపు హిట్టే.. అప్పుటి కొత్తబంగారు లోకం,  హ్యాపీ డేస్ ల నుండి ఇప్పటి బేబీ సినిమా వరకు అన్ని యూత్ ని ఆకర్షిస్తూ వెండి తెర మీద పేపర్లు విసిరేలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తో షణ్ముఖ్ 'స్టూడెంట్' వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ ని రెండు వారాల క్రితం రిలీజ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో 'ది స్టూడెంట్ యాంథమ్' లిరికల్ సాంగ్ కి షణ్ముఖ్ తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేశాడు. దాంతో ఇప్పుడు ఈ లిరికల్ సాంగ్ కి విశేష స్పందన లభిస్తుంది.

రోజురోజుకి పెరుగుతున్న పల్లవి ప్రశాంత్ క్రేజ్.. బిగ్ బాస్ లోకి వెళ్తాడా?

టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షోకి ఉన్నంత క్రేజ్ అంత ఇంత కాదు. ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 3 గ్రాండ్ గా ప్రేక్షకుల ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అయింది. బిగ్ బాస్ ని ఇష్టపడే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుండగా.. ఈ సారి కంటెస్టెంట్స్ గా ఎవరిని తీసుకుంటున్నారన్నది అందరిలో ఉన్న క్వశ్చన్. కాగా గత సీజన్ లో పాపులారిటి లేని కంటెస్టెంట్స్ ని ఎక్కువగా తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ సారి జాగ్రత్తగా ఉంటున్నారని, కొత్తగా ఉంటుందనే టాక్ వినబడుతుంది.