English | Telugu
వారి రొమాన్స్ చూసి పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి!
Updated : Aug 8, 2023
"నీతోనే డాన్స్" షో ప్రతీ వారం దుమ్ము రేపుతోంది. డాన్స్ పెర్ఫార్మన్సెస్ తో పాటు హాట్ హాట్ కామెంట్స్, ఫైట్స్, అలకలు, బుజ్జగింపులు ఫుల్ ప్యాకేజీ షోలా ఉంటుంది ఇది. ఇక ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ షోలో శ్రీముఖి ఇంటరెస్టింగ్ కామెంట్ ఒకటి చేసింది. నెక్స్ట్ వీక్ "కనెక్షన్ రౌండ్" అనే థీమ్ తో కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్సెస్ రాబోతున్నాయి. ఇందులో అమరదీప్-తేజు జోడి "కుంకుమల నువ్వే చేరవా ప్రియా" అనే సాంగ్ కి డాన్స్ చేశారు.
ఐతే ఈ సాంగ్ స్టార్టింగ్ లో "మనసుకు పెనిమిటి ఎలాగో నుదిటికి కుంకుమ అలాగా..ప్రతీ భర్త భార్యను తాకే మొదటి స్పర్శ నుదురు.. ఆ నుదురును సింధూరంతో అలంకరించడం ఒక జీవిత జ్ఞాపకం" అని సాగే ఒక వైబ్రెంట్ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఈ డాన్స్ కి జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు. ఇక శ్రీముఖి "ఇలాంటివి చూసినప్పుడు కదా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది" అని కామెంట్ చేసింది. ఇంకా ఈ షో ఎంట్రన్స్ లో ధూమ్ ధామ్ టీమ్, దుమ్ము లేపు టీమ్స్ రెండు వాళ్ళ వాళ్ళ స్టయిల్లో డాన్స్ చేస్తూ వచ్చారు. "నటరాజ్ మాస్టర్ ని మీరు లైవ్ లో చూడాలనే కదా వచ్చేసారు" అని ఆట సందీప్-జ్యోతిని అడిగేసరికి " ఇలా క్యూట్ గా మాట్లాడి మాట్లాడి అలా అంటించేసి వెళ్తున్నావని బయట టాక్ వినిపిస్తోంది" అని శ్రీముఖి గురించి జ్యోతి చెప్పేసరికి శ్రీముఖి స్టన్ ఐపోయింది. "అదే శ్రీముఖి నారాయణ నారాయణ అంటూ నారదుడిలా ఉంటే రాధ గారు వచ్చి నమో నారాయణ నమో నారాయణ" అంటుంటారు అని వాళ్ళ మీద సెటైర్ వేశారు జడ్జ్ తరుణ్ మాష్టర్. ఇక నెక్స్ట్ వీక్ ప్రసారమయ్యే ఎపిసోడ్ లో అన్ని జోడీస్ కూడా ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేశారు. నటరాజ్ మాస్టర్ - నీతూ జోడి డాన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నీతూ ఫ్లోర్ మూవ్మెంట్ చూసాక జడ్జ్ రాధా కూడా ఆమెకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు.