English | Telugu
వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఇనయా డ్యాన్స్!
Updated : Aug 8, 2023
ఇనయా సుల్తానా.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ. ఇనయా ఒక ఫైర్ బ్రాండ్. ఒక లేడీ టైగర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మడు గురించి చాలానే ఉంది. బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ సంపాదించి సెలబ్రిటీ రేంజ్ ని పొందింది. సోషల్ మీడియా అంతా నాదే అన్నట్లుగా పోస్ట్ లతో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది ఇనయా. ఆమె ఏం చేసినా ట్రెండింగ్ లోకి వెళ్తుంది. అంతలా ఇన్ స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది ఇనయా. ప్రతీదానిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పే ఇనయాని ఇన్ స్పిరేషన్ గా తీసుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్-6 ముందు వరకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ సీజన్-6 తో ఫుల్ ఫేమస్ అయింది. రామ్ గోపాల్ వర్మతో చిందులు వేసిన వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకొని, బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. లేడీ టైగర్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు. హౌస్ లో ఎక్కువగా గొడవలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అందరి చూపు తన వైపు తిప్పుకుంది ఇనయా. హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కువ ప్రేక్షకులను సంపాదించుకుంది.
ఎప్పుడు బోల్డ్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే ఇనయా.. ఈ మధ్య డ్యాన్స్ క్లాస్ లకి వెళ్తోంది. సోహెల్ తో కలిసి చేసిన ఒక రొమాంటిక్ సాంగ్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ' సమ్మోహనుడ '. ఈ పాటకి ఇనయా హాట్ గా డాన్స్ చేసి తన టాలెంట్ ని చూపించింది. ఇనయా వారం కిందట తన డాన్స్ వీడియోని షేర్ చెయ్యగా, ఇప్పటికే ఈ వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. కాగా హాట్ అండ్ బోల్డ్ ఫోటోలకి తగ్గేదులే అంటూ అప్పట్లో ఒక నెటిజన్ కి ఘటుగా రిప్లై ఇచ్చిన ఇనయా.. ఇప్పుడు అదే బాటలో నడుస్తుంది. ఇనయా చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక వీక్షకాధరణ పొందుతుంది.