బీర్ తాగడం అలా అలవాటు అయ్యింది..ఇప్పుడు రోజూ రెండు పెగ్గులు తాగుతా
"శుభలేఖ సుధాకర్" క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోలకు ఫ్రెండ్ రోల్స్ లో గొప్ప గొప్ప పాత్రల్లో నటించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. కమల్ హాసన్, అర్జున్ నటించిన "ద్రోహి" మూవీలో సుధాకర్ యాక్షన్ ని అస్సలు మర్చిపోలేము. రీసెంట్ గా ‘వకీల్ సాబ్’ మూవీలో చేసింది చిన్న పాత్రే ఐనా మంచి పేరు వచ్చింది.. అలాగే ‘రామబాణం’ మూవీలో కూడా కీలక పాత్ర పోషించారు. జడ్జిగా, బాబాగా, తాతగా ఇలా అనేక రకాల పాత్రలు సుధాకర్‌ని వరిస్తున్నాయి. 1999 తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్నశుభలేఖ సుధాకర్.. మళ్లీ 2004లో ‘ఆ నలుగురు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘భీష్మ’, ‘వకీల్ సాబ్’ మూవీస్ మంచి గుర్తింపుని ఇచ్చాయి.