English | Telugu
అనిల్ జీల రాసిన మూవీ నిడివి అంతనా!
Updated : Aug 8, 2023
అనిల్ జీల హలో వరల్డ్ తో చాలా మంది కి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.
యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీల ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు చేయడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి...
అనిల్ జీల సొంతంగా ఒక మూవీ స్క్రిప్ట్ రాస్తున్నాడన్న విషయం తెలిసిందే. పెద్ద తోవకి సిద్ధమంటూ తను స్క్రిప్ట్ రాసే ఫొటోని షేర్ చేశాడు. ఇప్పుడు తాజాగా వర్క్ ఆన్ ప్రోగ్రెస్ అని.. సినిమా టైమ్ ని ప్రతి నిమిషాన్ని లెక్కించి చేసుకున్నానని, సినిమా మొత్తం నిడివి 2 గంటల 25 నిమిషాలు ఉంటుందని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు అనిల్ జీల. కాగా మై విలేజ్ షో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.