English | Telugu
కోపం వస్తే అమ్మా, నాన్న బెడ్ రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంటారు
Updated : Aug 8, 2023
జీ తెలుగులో ఎన్నో షోస్ వస్తున్నాయి... సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వెళ్లిపోతున్నాయి. ఇక ఇప్పుడు "ఫామిలీ నెంబర్ 1 "పేరుతో ఒక కంప్లీట్ ఫామిలీ ఎంటర్టైనర్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. ఇందులో 8 ఫ్యామిలీస్ మధ్య పోటీలను పెట్టబోతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ వారం వీళ్లందరినీ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల బ్యాక్ గ్రౌండ్ గురించి ఆడియన్స్ కి ఏవి రూపంలో చూపించారు.. మరి ఆ 8 ఫామిలీస్ ఎవరంటే ధన్ రాజ్, ధరణి ప్రియా, కృష్ణ చైతన్యు, కౌశల్, మహేశ్వరీ, హ్రీతేష్, సిద్దార్థ్, శ్రీలలిత ఫామిలీస్ ఈ షోలో ఎంటర్టైన్ చేయబోతున్నాయి. ఇందులో ముందుగా ధన్ రాజ్ ఫామిలీ ఎంట్రీ ఇచ్చింది. ధన్ రాజ్ ఫామిలీని ఇంట్రడ్యూస్ చేయడానికి చమ్మక్ చంద్ర వచ్చాడు.
ధన్ రాజ్ తన లైఫ్ కి సంబంధించిన ఒక ఏవిని చూపించారు. ఐతే చంద్రకు వాళ్ల నాన్న ఎలా ఉంటాడో తెలియదని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. చంద్ర చిన్నప్పుడు లారీ క్లీనర్ గా పని చేసాడు..ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ వచ్చి హోటల్ లో కూడా క్లీనర్ గా పని చేసాడని చెప్పాడు. అలా శిరీష అనే అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చాక తన లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందని చెప్పారు ధన్ రాజ్, చంద్ర. ఇలాంటి ఒక ఎమోషనల్ మూమెంట్ లో కొంచెం కూల్ చేయడానికి హోస్ట్ రవి ఒక ప్రశ్న వేసాడు "అమ్మకి, నాన్నకు కోపం వస్తే ఫస్ట్ చేసే పనేంటి" అని అడిగేసరికి ధన్ రాజ్ వాళ్ల పెద్దబ్బాయి సుక్కు "బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంటారు" అని చెప్పాడు.. తర్వాత మాట మార్చి "అమ్మ బెడ్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది...డాడీ హాల్లో ఉంటాడు" అని చెప్పాడు. ఇక ధన్ రాజ్ చిన్న కొడుకు రాజ్ దీప్ మైక్ మీద తన పేరు రాయలేదని ఏడవడం...రవి చివరికి మైక్ మీద అతని పేరు రాయించి, చేతికి లాలీపాప్ ఇచ్చి ఊరుకోబెట్టడం ఈ షోలో నవ్వు తెప్పించాయి. ఇక ఈ షోలో ధన్ రాజ్ ఫామిలీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని రవి అడిగేసరికి క్లీన్ కామెడీని అందిస్తాం అని ఆడియన్స్ కి చెప్పారు. వీళ్ళ ఫామిలీకి "విరూపాక్ష ఫామిలీ" అనే పేరు పెట్టాడు రవి.