English | Telugu
బ్రహ్మముడి సీరియల్ కోసం కావ్య ఇంత కష్టపడుతోందా...
Updated : Aug 8, 2023
స్టార్ మాలో బ్రహ్మముడి సీరియల్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఈ షోలో రాజ్ గా మానస్, కావ్యగా దీపికా రంగరాజు నటనకి అందరూ అట్ట్రాక్ట్ అయ్యారు. ఈ సీరియల్ లో రాజ్ కి జ్యువెలరీ డిజైన్ కంపెనీ ఉంటుంది. ఇక హీరోయిన్ కావ్య అందులో తన పేరుతో కాకుండా మారు పేరుతో డిజైన్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక రోజు రాజ్ కి ఆ విషయం తెలిసిపోతుంది. తన వైఫ్ కావ్య ఇంత బాగా డిజైన్ చేస్తోంది అనే విషయం తెలుసుకుని ఆమెకు అఫిషియల్ గా కంపెనీ డిజైనర్ పోస్ట్ లో అపాయింట్ చేస్తూ జాయినింగ్ ఆర్డర్ కూడా ఇస్తాడు .
ఇది నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. ఐతే ఇదెందుకు అనుకుంటున్నారా... కావ్య నగల డిజైన్స్ కోసం తన సీరియల్ షూటింగ్ ఐపోయాక నగల షోరూమ్ కి వెళ్లి అక్కడ ఎన్నో రకాల డిజైన్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ కనిపించింది. ఇక తన నగల డిజైన్ సెలక్షన్ చేసే వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "రాజ్ చూసారా మీ కావ్య ఎంత కష్టపడుతుందో..స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోసం ..నేను వర్క్ హాలిక్ అండి..ఈ నగల సెలక్షన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే " అంటూ టాగ్ లైన్ పెట్టింది. ఐతే సీరియల్ లో కావ్య ఇలా డిజైన్స్ వేసి వచ్చిన డబ్బుతో తన పుట్టింటి వాళ్ళ కష్టాలు తీర్చాలనుకుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళ మాటలకు భయపడి ఆ జాయినింగ్ ఆర్డర్ తీసుకోదు.
ఇలా సాగుతోంది ఈ సీరియల్..ఇక దీపికా రంగరాజు, మానస్ ఇద్దరి నటనతో ఈ సీరియల్ ప్రతీ వారం టాప్ పొజిషన్ లో నిలుస్తోంది. కావ్య తన సిస్టర్స్ ని కాపాడుకుంటూ తన పుట్టింటి గురించి ఆలోచిస్తూ ఇటు అత్తింటిలో రాహుల్ ని ఒక కంట కనిపెడుతూ రుద్రాణి మాటలకు ఓర్చుకుంటూ కనిపిస్తుంది కావ్య. ఇక ఇది ఫామిలీ డ్రామా కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సీరియల్ ని బాగా ఆదరిస్తున్నారు. కార్తీక దీపం ఐపోయాక అదే టైం స్లాట్ లో ఇంత మంచి సీరియల్ ని ప్రసారం చేస్తున్నారంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.