English | Telugu

అష్షుకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో..ఆమెను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్

అష్షు రెడ్డి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మంచి హాట్ బ్యూటీ అంతేకాదు ఆర్జీవీ హీరోయిన్ కూడా.. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ  అందాలు ఆరబోయడంలో బేబీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో  ఫాలోయింగ్ పెంచుకుని.. సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే  హీరోయన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. "ఏ మాస్టర్ పీస్‌" మూవీతో అరవింద్‌ కృష్ణతో కలిసి నటించింది.  అలాంటి అష్షుకి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఆ కష్టం పేరే "ఫేస్ ఐడీ". చాలా మంది ఈమధ్య కాలంలో ఫేస్ ఐడీని యూజ్ చేస్తూ ఆండ్రాయిడ్ ని అన్లాక్ చేస్తున్నారు. దాంతో సెల్ పాస్ వర్డ్స్ ని కూడా మర్చిపోతున్నారు.

బిగ్ బాస్ డేట్ ఫిక్స్‌.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ఎంట్రీ!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7కు సంబంధించిన స‌న్నాహాలు జోరుగా జ‌రుగుతున్నాయి. వివ‌రాల‌ను ముందుగా బ‌య‌ట పెట్ట‌రు. అయితే లీకులు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. తాజాగా బిగ్ బాస్ 7 తెలుగుకి సంబంధించిన నిర్వాహ‌కులు హైప్‌ను క్రియేట్ చేయ‌టానికి ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. సీజ‌న్ 6, బిగ్ బాస్ ఓటీటీ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో సీజ‌న్ 7పై ముందు నుంచే స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నారు. కాస్త తెలిసిన ముఖాల‌ను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకు రావ‌టం అనేది ఆ ప్లానింగ్‌లో భాగమ‌ని తెలుస్తోంది. అందులో భాగంగా ఓ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్‌ని హౌస్‌లోకి ర‌ప్పిస్తున్నార‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

షోలో కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ...ఇన్నాళ్లు ఇది నేను మిస్ అయిపోయానా..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఎవరు హైలైట్ ఐనా కాకపోయినా ఇంద్రజ మాత్రం తన కామెంట్స్ తో, తన సెటైరికల్ డైలాగ్స్ తో మంచి కామెడీ చేస్తూ ఉంటారు. అలాంటి ఇంద్రజ ఈ షోలో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. కానీ నెక్స్ట్ వీక్ ప్రోమోలో మాత్రం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ షోలో ఆమె చేసిన క్లాసికల్ డాన్స్ కి ఎందరో ఫిదా ఇపోయారు. ఆ డాన్స్ ఐపోయాక ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఈ కాస్ట్యూమ్ నేను వేసుకున్నప్పుడు చెప్పలేదు కానీ..నాలో ఏదో ఆనందం పొంగుతోంది. ఇన్నాళ్లు ఇది నేను మిస్ అయిపోయానా" అంటూ.. గుక్క పెట్టి ఏడ్చేశారు. ఇంద్రజ ఎమోషనల్ అయిన తీరుతో అక్కడ అందరూ కూడా ఫీలైనట్టు కనిపించింది.

బిగ్ బాస్ లోకి జబర్దస్త్ బ్యూటీ తన్మయ్

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్‌ షోకి ప్రతీ సీజన్ లో మంచి రేటింగ్ దక్కుతోంది. .అయితే ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 7 ని త్వరలో తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి లోగో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది. అలాగే ఈ న్యూ సీజన్ లో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయని నాగార్జున చెప్పేసారు.  ఈ నెలాఖరులోపు బిగ్ బాస్ కొత్త సీజన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ హౌస్ లోకి వెళ్ళేవాళ్ళతో ఇప్పటికే మంతనాలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కో పేరు వినిపిస్తోంది. ఐతే ఈ సీజన్ లోకి జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. `జబర్దస్త్` షో ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ షోకి వచ్చి ఇప్పుడు జబర్దస్త్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో కొంతమంది  స్టార్స్  కూడా అయ్యారు.

సందీప్ కొంచెం ఎదుగు..అంత స్ట్రాటజీ ప్లే చేయాల్సిన అవసరం లేదు

"నీతోనే డాన్స్" షో ఈ వారం ఇంకా ఎక్కడా కాంట్రోవర్సి కంటెంట్ రాలేదు అంటుకుంటున్న టైంలో గొడవ జరిగిపోయింది. అమరదీప్ - తేజు - అభినయశ్రీ ముగ్గురూ కలిసి అడవిలో జంతువుల్ని మనుషులు ఎలా చంపేస్తున్నారో చెప్తూ ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసాక జడ్జెస్ అందరూ ఫిదా ఇపోయారు. యానిమల్ లవర్ ఐన సదా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఇక మార్క్స్ ఇచ్చేటప్పుడు సాగర్, ఆట సందీప్ మధ్య కాసేపు గొడవయ్యింది. "నా పెర్ఫార్మెన్స్ లో ఒక మూవ్మెంట్ తప్పొచ్చిందని మార్క్ కట్ చేశారు మరి అమరదీప్ వల్ల పెర్ఫార్మెన్స్ లో కూడా ఒక సందర్భంలో కంటెస్టెంట్ పడిపోయారు..మరి ఎందుకు ఫుల్ మార్క్స్ ఇచ్చారు" అని సందీప్ సాగర్ ని క్వశ్చన్ చేసేసరికి.."నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను" అని సాగర్ చెప్పేసారు..ఇక మధ్యలోకి రాధ ఎంట్రీ ఇచ్చారు .."సందీప్ కాస్త ఎదుగు..నీకు ఇంతకు ముందు ఈ విషయం గురించి చెపుదాం అనుకున్నా..కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.

పెదవి కొరుక్కుపో అంటున్న మల్లి!

భావన లాస్య.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 'మల్లి' అంటే అందరికి సుపరిచితమే. ఎందుకంటే 'మల్లి' సీరియల్. స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కి విశేష ఆదరణ లభిస్తుంది. మల్లి సీరియల్ లో అరవింద్ ని ఇష్టపడి, ఆ తర్వాత మాలిని కోసం తన ప్రేమను త్యాగం చేసి వదిలి వెళ్తుంది మల్లి. ఆ తర్వాత మల్లి చేస్తోన్న ఆఫీస్ లోనే అరవింద్ జాబ్ కి జాయిన్ అవుతాడు. మాలిని తనని జాబ్ మానేయమని, లేదా అరవింద్ ని జాబ్ మానేయమని చెప్తుంది. నేనెలా చెప్తానను మల్లి అంటుంది. ఇది భోనాల జాతరలో మల్లి, మాలినిల సంభాషణ. మరి మాలిని చెప్పినట్టు మల్లి చేస్తుందా.. దూరంగా వెళ్తుందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

అఖిల్ కాకపొతే నిఖిల్..గతంతో నాకు పని లేదు

బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ షో "నీతోనే డాన్స్" ప్రతీవారం శని, ఆదివారాల్లో మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంటోంది. బీబీ జోడిని తలదన్నేలా ఉంటున్నాయి ఈ షోలోని డాన్స్ పెర్ఫార్మెన్సెస్..నీతోనే డాన్స్ షోలో బీబీ జోడిని ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇక వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈ వారం వాళ్ళను కూడా తీసుకొచ్చారు. నిఖిల్-కావ్యకి జోడీగా తేజస్విని మాదివాడ ఎంట్రీ ఇచ్చింది. బీబీ జోడిలో తేజు-అఖిల్ జోడి చేసిన రచ్చని ఇప్పటికీ ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేదు. ఆ హాట్ డాన్స్   స్టెప్స్ ఇంకా గుర్తున్నాయి. జడ్జి రాధ ఐతే ఈ జోడి చేసే  పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఐపోయేవారు.

ట్రెండింగ్ లో షణ్ముఖ్ 'స్టూడెంట్ యాంథమ్' సాంగ్!

కాలేజ్ లైఫ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏ స్టోరీ అయినా దాదాపు హిట్టే.. అప్పుటి కొత్తబంగారు లోకం,  హ్యాపీ డేస్ ల నుండి ఇప్పటి బేబీ సినిమా వరకు అన్ని యూత్ ని ఆకర్షిస్తూ వెండి తెర మీద పేపర్లు విసిరేలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తో షణ్ముఖ్ 'స్టూడెంట్' వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ ని రెండు వారాల క్రితం రిలీజ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో 'ది స్టూడెంట్ యాంథమ్' లిరికల్ సాంగ్ కి షణ్ముఖ్ తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేశాడు. దాంతో ఇప్పుడు ఈ లిరికల్ సాంగ్ కి విశేష స్పందన లభిస్తుంది.