English | Telugu

మావ-కోడళ్ల ఫైట్స్ తో కొత్త సీరియల్ త్వరలో స్టార్ మాలో  మావగారు

స్టార్ మా అంటే చాలు కలర్ ఫుల్ ఈవెంట్స్ మాత్రమే కాదు మంచి జోష్ ఉన్న సీరియల్స్ అని కూడా తెలుసు. ఆడియన్స్ స్టార్ మా సీరియల్స్ ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో ప్రసారమయ్యే సీరియల్స్ కంటెంట్ కావొచ్చు రేటింగ్ కావొచ్చు ఆ రేంజ్ లోనే ఉంటాయి మరి. ఇక ఇప్పుడు కొత్త సీరియల్ ఒకటి పట్టాలెక్కబోతోంది. అదే "మామగారు". దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో "దేవత" సీరియల్ ఫేమ్ లీడ్ రోల్ చేస్తోంది . అప్పట్లో  'దేవత' సీరియల్ ... అందులో నటించిన సుహాసిని ఎంతో మందికి నచ్చేసింది. ఈ సీరియల్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సుహాసిని లీడ్ రోల్ లో చేసినా  లేడీ ఓరియెంటెడ్ సీరియల్ ని లైన్ లోకి తీసుకొస్తోంది స్టార్ మా.  

ముందు ఫ్రెండ్..తర్వాత వైఫ్ అన్న అమర్ ..ఇంటికి రా నీ పని చెప్తా అన్న తేజు

'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి జోష్ తో కనిపిస్తోంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భాన్ని పురస్కరించుకుని "ఫ్రెండ్ షిప్ డే స్పెషల్" గా  ఈ ప్రోమోని డిజైన్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ కి  అమర్ దీప్  - మానస్ , తేజస్విని గౌడ - సుహాసిని , ముక్కు అవినాశ్-కెవ్వు కార్తిక్, అనపూర్ణమ్మ- శ్రీలక్ష్మీ, బేబీ క్రితిక- సహృద, నోయెల్- వితికా శేరు వచ్చి ఆడియన్స్ అలరించారు. ఈ సందర్భంగా అమర్‌ను సరదాగా ఆట పట్టించింది శ్రీముఖి. "నీ పెళ్లాం కోసం వచ్చావా నిజంగా నీ ఫ్రెండ్ మానస్ కోసం వచ్చావా" అని అడిగేసరికి "ఫస్ట్ అయితే ఫ్రెండ్ కోసం వచ్చా ఆ తర్వాతే పెళ్లాం" అని అమర్ అనేసరికి అక్కడే ఉన్న  తేజు " ఇంటికి రా చెప్తా" అని  సరదాగా ఆట పట్టించింది. తర్వాత సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ- శ్రీలక్ష్మి వచ్చారు.

ఈ భూమ్మీద అసలైన అప్సరస తనేనంట!

బిగ్ బాస్ లో గ్లామర్ కి  కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచిన బ్యూటీ వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ సీజన్-6 లో తన అందంతో ఆకట్టుకొని అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ లోకి వచ్చిన ఈ గ్లామర్ క్వీన్ వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది...హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. ప్రస్తుతం బీబీ జోడీలో అర్జున్ కి జంటగా వాసంతి జత కట్టి అందరిని తన డాన్స్ తో తన వైపుకి తిప్పుకుంది.

ఇప్పుడు సోహెల్ ప్రెగ్నెంట్ అంట.. మరి డ్యాన్స్ చేయోచ్చా!

జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు‌. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.‌. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు.ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లగ్స్  అప్లోడ్ చేయగా అత్యధిక వీక్ష

ఎందుకంత ద్వేషం...అసలా గుంపును రెచ్చగొట్టిన వాళ్లెవరు...బాధపడుతున్న ఝాన్సీ

ఫస్ట్ జనరేషన్ స్టార్ యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. అప్పట్లో  సుమ, ఉదయభాను, ఝాన్సీ ఫుల్ ఫార్మ్ లో ఉండేవాళ్ళు. వీళ్ళను  చూస్తే చాలు ఆడియన్స్ లో ఫుల్ జోష్ వచ్చేది. "టాక్ ఆఫ్ ది టౌన్" షో ఝాన్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరించారు కూడా. యాంకరింగ్ చేస్తూనే నటిగా కూడా ఈమె మంచి సక్సెస్ ని అందుకున్నారు. అలాంటి ఝాన్సీ లైఫ్ లో కొన్ని ఇష్యూస్  కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆమె యాంకరింగ్ ఒకప్పుడు టాప్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియా వాడకం పెరిగాక ఝాన్సీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

90 లక్షలు ఇన్వెస్ట్ చేయనున్న ఆహా నేను సూపర్ ఉమెన్ ఏంజెల్స్

వితం అంటే పోరాటం, ఆ పోరాటంలోనే ఉంది జయం అని అనుకున్న ఎంతో మందిలో మన ఆహా నేను సూపర్ ఉమెన్ యొక్క ఉమెన్ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వి హబ్ తో కలిసి స్టార్ట్ అప్ ఉమెన్ ఇంటర్ప్రెన్యూర్స్ కోసం నేను సూపర్ ఉమెన్ అనే షో తోటి ఆహా ఇప్పటికి తెలుగు రాష్ట్ర ప్రజల మనసులని గెలుచుకుంది. ఇపుడు మరిన్ని సరికొత్త ఎపిసోడ్స్ మీ ముందుకు వచ్చేస్తున్నాయ్. ఈ వారం అక్షరాలా 90 లక్షలు మన ఏంజెల్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఎవరికి ఇన్వెస్ట్మెంట్ దక్కింది, ఎవరు ఎవరి మెంటార్షిప్ అందుకున్నారు తెలుసుకోవాలి అంటే ఈ 4 మరియు 5 ఆగష్టు రాత్రి 7 గంటలకు ఆహలో మన 'నేను సూపర్ వుమన్' షో తప్పక చూడండి .

అఖిల్ ని వర్జినా? కాదా అని అడిగిన నెటిజన్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.  అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.

బ్రహ్మముడి కావ్య, రాజ్ చేసిన రీల్ కి వన్ మిలియన్ వ్యూస్!

హలో గురు ప్రేమ‌ కోసమేరా జీవితం.. పాటతో ‌అప్పట్లో నిర్ణయం సినిమాలో నాగార్జున,  అమల కలిసి‌ చేసిన డ్యూయెట్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.‌ ఇప్పటికీ ఆ పాట అంటే అంతే క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆ పాటలోని లిరిక్స్ కి ఎంతో మంది సెలబ్రిటీలు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్‌ అంటూ తెగ వైరల్ అవుతున్నారు.‌ అయితే ఇప్పుడు అదే కోవకు మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు చేరారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా వీరిద్దరు కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటతో రీల్ చేశారు. అయితే వీరిద్దరు కలిసి చేసిన ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.