Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి షాకిచ్చిన మాణిక్యం.. అభి గురించి నిజం తెలిసిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -52 లో..  మాణిక్యం ఫ్యామిలీ పెళ్లికి ముహుర్తం పెట్టడం కోసం సీతాకాంత్ వాళ్ళింటికి వస్తారు. అక్కడ శేషాచారి గారి శిష్యుడని పంతులు గారు చెప్పడంతో .. ధన ఫోన్ ని మాణిక్యం తీసుకొని డైరెక్ట్ గా శేషాచారికే ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. దాంతో కాసేపటికి శేషాచారి వస్తాడు. 

ఆ శేషాచారి పంతులు రాగానే మాణిక్యం నలుగురి జాతకాలు చూపించి వీరికి ఒకే మహుర్తానికి పెళ్ళి చేయోచ్చా అని అడుగుతాడు. ఇక శేషాచారి చూసి రామలక్ష్మి, సీతాకాంత్ లది జన్మజన్మల బంధం, వీరు గత జన్మలో కలిసేవారు కానీ ఈ జన్మలో కలవాడినే పుట్టారు. వీరిద్దరివి అరుదైన, అద్భుతమైన జాతాకాలు ఇలాంటివి ప్రపంచంలోనే ఒకటో రెండో ఉంటాయి అంతే అని శేషాచారి చెప్పడంతో మాణిక్యం ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. విన్నారా అల్లుడు గారు, విన్నారా చెల్లి గారు సీతాకాంత్, రామలక్ష్మిలది అరుదైన బంధమంట అని అంటాడు. ఆ తర్వాత శ్రీలతతో   అయిదువేలనూటపదహారు పంతులికి మాణిక్యం ఇప్పించి పంపిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మిని సీతాకాంత్ పక్కన కూర్చోబెట్టి ఫోటోలు తీసుకుంటాడు మాణిక్యం. ఎందుకని సీతాకాంత్ అనగా.. ఫ్లెక్సీలలో ఫోటోలకి అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత నైట్ ధన, రామలక్ష్మి కలిసి సీతాకాంత్ ని కలిసి ఇలా జరిగిందేంటని మాట్లాడుకుంటారు. మీ నాన్న మనకన్నా ఎక్కువగా వ్యూహ రచన చేశాడని సీతాకాంత్ అనగానే.. మరి ఇప్పుడు ఏం చేద్దామని రామలక్ష్మి అంటుంది. మీ ఇద్దరికి నేనే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులు ఎక్కడికి అయిన వెళ్ళండి. పరిస్థితులు చక్కబడ్డాక రండి అని సీతాకాంత్ అనగానే.. మరి నన్నే నమ్ముకున్న నా కుటుంబం పరిస్థితి ఏంటని రామలక్ష్మి అంటుంది.

మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని సీతాకాంత్ అంటాడు. మా నాన్న తాగితందనాలు ఆడతాడు. నా కుటుంబానికి నేనే ఆధారమని రామలక్ష్మి ఎమోషనల్ అవ్వగా.. మరి ఇప్పుడు ఏం చేస్తావ్ నన్ను పెళ్ళి  చేసుకుంటావా అని సీతాకాంత్ అనగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. ధన రిక్వెస్ట్ చేసేసరికి, తమ కుటుంబ ఇంటిభాద్యత సీతాకాంత్ చూసుకుంటానని చెప్పగానే.. మీరు చెప్పినట్లు చేద్దామని రామలక్ష్మి అంటుంది. ఇక  అప్పుడే అటువైపు నుండి బాగా తాగేసి వస్తున్న మాణిక్యం వారి ముగ్గురిని చూసి.. ఇదేదో పెద్ద ప్లానే అనుకుంటాడు‌. ఆ తర్వాత సీతాకాంత్ ని కలిసిన మాణిక్యం ఏంటని అడుగగా.. ఏదో చెప్పబోతుండగా అతడిని మాణిక్యం ఆపేస్తాడు. నువ్వు ఏదో కవర్ చేయడానికి అబద్దం చెప్తావ్.‌ సీన్ అంతా అర్థమైందని రేపే గుడిలో మీ పెళ్ళి..  రామలక్ష్మితో మీ పెళ్ళి జరిగితేనే సిరి, ధనల పెళ్ళి జరుగుతుందని మాణిక్యం చెప్పేసి వెళ్లిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయమే ముస్తాబైన మాణిక్యం‌‌.. తన భార్యని పిలుస్తాడు. ఎక్కడి అని తన భార్య అడుగగా.‌. మనశ్శాంతి కరువైందని శాంతి హోమం చేపిస్తున్నానని, ఆ పనులు ఎలా జరుగుతున్నాయో చూసొస్తానని మీరందరు గుడికి వచ్చేసేయండని మాణిక్యం అనగానే.. తన భార్యతో పాటు రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి చాలా ఎదిగిపోయవమ్మా అని మాణిక్యం అంటాడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు నాన్న అని రామలక్ష్మి అనగానే.. అభి అని మాణిక్యం అంటాడు. దాంతో రామలక్ష్మి షాక్ అవుతుంది. ‌ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.