English | Telugu

Guppedantha Manasu : అనుపమ కొడుకే ఈ మను.. ట్విస్ట్ ల మీద ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1030 లో... అనుపమ గురించి మను టెన్షన్ పడుతుంటే.. తనకేం కాదంటూ మహేంద్ర ధైర్యం చెప్తాడు. మీరిద్దరు తల్లి కొడుకులనే విషయం ఎందుకు దాచారని మహేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఎన్నోసార్లు అత్తయ్యని అడిగాను.. ఏం సమాధానం చెప్పలేదని ఏంజిల్ అంటుంది. ఇందాక మీ పీఏ వచ్చి జరిగింది మొత్తం చెప్పారు. ఒక మాట మీరు నిజం చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమోనని వసుధార అంటుంది.

ఆ తర్వాత అందరు అలా అడిగేసరికి.. మను ఎమోషనల్ అవుతాడు. అవును మేమ్ తల్లి కొడుకులమే.. ఆవిడా నా కన్నతల్లి అని మను చెప్తాడు. నన్ను ఏ లోటు రాకుండా పెంచిందని అనుపమ గురించి మను గొప్పగా చెప్తాడు. నేను తనకి ఒక మాట ఇచ్చాను. తనే మాట తీసుకుంది కానీ ఈ రోజు మాట తప్పాను. తను లేకుంటే ఈ రోజు నేను ఉండేవాణ్ణి కాదు కదా.. తన ప్రాణాలకి తెగించి మరి ఈ రోజు నన్ను కాపాడిందని మను ఎమోషనల్ అవుతాడు. ఇంత బాధని దిగమింగుకొని మాములుగా ఉన్నావని మహేంద్ర అంటాడు. కానీ నన్ను వెంటడే ఒక ప్రశ్నతో చాలా బాధపెట్టానని మను అంటాడు. ఆ తర్వాత అనుపమ స్పృహలోకి రాగానే.. అందరు లోపలికి వెళ్తారు. కానీ మను మాత్రం బయటే ఉంటాడు.

ఆ తర్వాత మహేంద్ర, వసుధారలు అనుపమ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఏంజిల్ కూడా వెళ్తుంది. ఆ తర్వాత మీ కొడుకు కోసం దైర్యం చేసి తన ప్రాణాలు కాపాడావని మహేంద్ర అంటాడు. వసుధార, ఏంజిల్ లు మనుని అనుపమ దగ్గరికి పంపిస్తారు. అనుపమతో మను మాట్లాడుతు ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత మహేంద్రకు ఫణీంద్ర ఫోన్ చేసి అనుపమ గురించి అడిగి తెలుసుకుంటాడు. అసలు అనుపమ కొడుకు మను ఏంటని అడుగుతాడు. మాకు ఇన్ని రోజులు ఏం తెలియదని మహేంద్ర అంటాడు . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.