Read more!

English | Telugu

Krishna Mukunda Murari : మురారిని అరెస్ట్ చేయించిన శ్రీనివాస్.. విడిపించడానికి‌ వచ్చింది ఎవరో తెలుసా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -424 లో.. ముకుంద తన రూపం మార్చుకొని తన మొహం తానే చూసుకుంటుంది. కృష్ణ‌ ఇక కాసుకో వస్తున్న నీ సంగతి చెప్తానని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ వస్తాడు. రూపం మారిన ముకుందని చూసి నేను నమ్మలేకపోతున్నానని అనగానే కన్నతండ్రివి నువ్వే గుర్తుపట్టలేదు.. ఇక వాళ్ళెలా గుర్తుపడతారని ముకుంద అంటుంది.

ఆ తర్వాత ఆ గొంతు నా కూతురిది కాదు అని శ్రీనివాస్ అంటాడు. ఓకల్ కార్డ్ కూడా మార్చేశారని ముకుంద అంటుంది. మురారి రూపం మారింది అయిన గొంతుబట్టి మురారి అని గుర్తుకుపట్టారు. నా విషయంలో అలా కాకూడదు ముకుంద బ్రతికే ఉందన్న డౌట్ కూడా రావద్దని ముకుంద అంటుంది. ఆ తర్వాత నా చావుకి కృష్ణ కారణమని తనని అరెస్ట్ చేయించు అని అనగానే.. కృష్ణేం పాపం చేసిందని శ్రీనివాస్ అంటాడు. నీ కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఆ కృష్ణ జైలుకు పోవాలని శ్రీనివాస్ కు ముకుంద చెప్తుంది. ఆ తర్వాత శ్రీనివాస్ ఎంపీ అయిన తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి  జరిగిందంతా చెప్పి మురారిని అరెస్ట్ చేయించమని చెప్తాడు. దానికి శ్రీనివాస్ ఫ్రెండ్ ఒకే అంటాడు. ఆ తర్వాత కృష్ణ, మురారి బయటకు వెళ్తుంటే.. అప్పుడే పోలీసులు వచ్చి ముకుంద చావుకి మీరే కారణం అని కంప్లైంట్ వచ్చిందని మురారి ని అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. మురారి మాత్రమే కాదు కృష్ణ కూడా అని ఆదర్శ్ అంటాడు. ఆ తర్వాత పోలీసులు మురారిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు.

ఆ తర్వాత ఆదర్శ్ తో సహా అందరు స్టేషన్ కి వెళ్తారు. అక్కడ తన చావుకి కారణం మురారి అన్నట్టు ముకుంద నోట్ రాసిందని పోలీసులు కృష్ణకి ఇస్తారు. అందులో మొత్తం తప్పు మురారిదే అన్నట్టు ఉంటుంది. అది ఆదర్శ్ కూడా చదివి కోపంగా వెళ్ళిపోతాడు. అది నిజం కాదని కృష్ణ చెప్పినా ఎవరు వినరు. తరువాయి భాగంలో మురారిని విడిపించడానికి రూపం మార్చుకున్న ముకుంద వస్తుంది. మీరు ఎవరని మురారి అడుగుతాడు. ముకుంద అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.