English | Telugu

నా బిడ్డని దూరం చేసుకోలేను... తల్లి ఎవరో తెలియదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -364 లో.. నేను మీ నిర్ణయం చెప్పండి అంటే మీరు బాబుతో వచ్చారు అదేనా మీ నిర్ణయమని రాజ్ ని కావ్య అడుగుతుంది. అందరు బాబు గురించే ప్రశ్నిస్తున్నారు.. అసలు ఈ బాబు తల్లి ఎక్కడ అని రాజ్ ని కావ్య అడుగుతుంది. బాబు ఏడుస్తుంటే బాబుని తీసుకొని రాజ్ గదిలో నుండి బయటకు వెళ్తాడు. మరొకవైపు నా కూతురికి అన్యాయం జరిగింది.. మీరే న్యాయం చేయండని కనకం అడుగుతుంటే.. ఏం చెయ్యమంటావంటు అపర్ణ వస్తుంది.

నీ కూతురు వచ్చినప్పటి నుండే ఇలా జరుగుతుందని అపర్ణ తిరిగి కావ్యని అంటుంది. నీ కూతురు అంటే ఇష్టం లేకే వాడు అలా చేసాడని అపర్ణ అంటుంది. అన్యాయం జరిగింది నా కూతురికే.. ఇప్పుడు మళ్ళీ నా కూతురినే అంటున్నారా అని అపర్ణపై కనకం కోప్పడతుంది. మీ కూతురిని మీరు తీసుకొని వెళ్ళండని అపర్ణ అనగానే.. తీసుకొని వెళ్తాను పంపించండని కనకం అంటుంది. అప్పుడే కావ్య వచ్చి.. ఆగు అమ్మ అని అంటుంది. నేను రాను ఏ నేరం చేసానని నేను రావాలి.. నాకు ఎందుకు అన్యాయం చేసారో చెప్పేవరకు నేను ఇంట్లో నుండి కదలను.. నాకు సమాధానం చెప్పేవరకు ఎవరు వెళ్లామన్నా నేను ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళనని కావ్య చెప్తుంది. ఆ తర్వాత అలా జరిగినందుకు అనామిక, రుద్రాణి , రాహుల్ ధాన్యలక్ష్మి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు‌‌.

నన్ను క్షమించు.. ఇదంతా నావల్లే విడాకులు అంటే వాడు మనసులో ప్రేమ బయటపెడతాడని అనుకున్నాను.. నా ప్రయత్నం నేను చేశాను.. ఇక నేనేం చెయ్యలేనని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కనకం తన కూతురికి జరిగిన అన్యాయానికి కోపంగా ఉంటుంది. తరువాయి భాగంలో బాబుని ఎక్కడ నుండి తెచ్చావో అక్కడ వదిలేసి రా అని అపర్ణ అనగానే.. నా బిడ్డకి కన్నతండ్రిని దూరం చేయలేనని రాజ్ అంటాడు. సరే నిన్న నువ్వు తీసుకొని వచ్చిన బాబు, నువ్వు.. మీరిద్దరు ఈ ఇంటికి ఏం కారు.. ఈ ఇంటి వారసులు కాదుమ. ఇదే నా నిర్ణయమని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.