English | Telugu

Krishna Mukunda Murari : మురారీని లాకప్ డెత్ చేయించాలని శ్రీనివాస్ ప్లాన్.. తనకు నిజం తెలిసేనా! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -425 లో.... ముకుంద ఆసుపత్రిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీనివాస్ రావడంతో.. నాన్నా.. అంతా నేను చెప్పినట్లే చేశావా.. కృష్ణను అరెస్ట్ చేయించావా.. మురారీ ఎలా ఉన్నాడని అడుగుతుంది. నువ్వు చెప్పినట్లే చేయించానమ్మా అంటు శ్రీనివాస్ అబద్దం చెబుతాడు. కానీ మనసులో మాత్రం.. నువ్వు చెప్పినట్లే అరెస్ట్ చేయించాను కానీ కృష్ణని కాదు, మురారీని. నువ్వు ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టి ఇస్తే.. నేను మురారీకి వ్యతిరేకంగా లేఖ రాశాను. రేపు నువ్వు స్టేషన్‌కి వెళ్లి చూసేసరికే మురారి లాకప్ డెత్ అయిపోయి ఉంటాడు. ఆ తర్వాత నువ్వు కాసేపు ఏడ్చి ఊరుకున్నా.. కనీసం అప్పుడైనా నీ జీవితం గురించి ఆలోచించడం మొదలుపెడతావ్.. నాకు ఆ నమ్మకం ఉందని శ్రీనివాస్ అనుకుంటాడు.

ఏంటి నాన్నా అలా ఉన్నారు.. ఏదైనా సమస్య ఉందా.. కృష్ణను మనకంటే ముందే మురారి విడిపించేస్తాడా‌‌ అని ముకుంద కంగారుగా అడుగుతుంది. లేదమ్మా.. హోమ్ మినిస్టర్ రికమెండేషన్‌ కాబట్టి ఆ ఛాన్స్ లేదు. నేను చూసుకుంటాను.. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని శ్రీనివాస్ అంటాడు. లేదు నాన్న.. సాయంత్రంతో డాక్టర్ చెప్పిన రెండు రోజులు అయిపోతాయి. రేపు ఉదయాన్నే నేను వెళ్లి మురారీని కలుసుకుని.. కృష్ణను విడిపించేస్తే అయిపోతుంది.. ఇక ఆ తర్వాత అంతా నేను అనుకున్నట్లే జరుగుతుందని, ఈసారి మురారి నా సొంతం అయ్యేంత వరకు వదిలిపెట్టనంటుంది ముకుంద. మరోవైపు కృష్ణ లంచ్ పట్టుకుని స్టేషన్‌కి వచ్చేసరికి.. మురారి గారిని.. పైఅధికారులు వేరే స్టేషన్‌కి తరలించారు మేడమ్ అని అక్కడి పోలీసులు చెప్తారు.. దాంతో కృష్ణ షాక్ అయిపోతుంది. అయ్యో ఎక్కడికి తీసుకెళ్లారంటు కృష్ణ అందరినీ ప్రాధేయపడుతుంది. ఎవ్వరు చెప్పరు. తెలియదంటారు. మరోవైపు అక్కడే ఉన్న మరో లేడీ కానిస్టేబుల్ కి దన్నం పెట్టి రిక్వెస్ట్ చేస్తుంది. ఈ కేసులో పెద్దపెద్దవాళ్లంతా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారమ్మా.. నాకు కూడా నిజంగా తెలియదు ఎక్కడికి తీసుకెళ్లారో. కానీ తెలిస్తే కచ్చితంగా కాల్ చేసి చెబుతాను.. మీరు వెళ్లండి మేడమ్ అంటుంది ఆమె.

ఇక కృష్ణ ప్రతీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. అదంతా ఎమోషనల్ గా సాగుతుంది. ఇక శ్రీనివాస్ దగ్గరకు కృష్ణ వెళ్లి.. తన బాధను చెప్పుకుని ఏడుస్తుంది. ఏసీపీ సర్‌ని విడిపించండి బాబాయ్ అంటూ శ్రీనివాస్ ని కృష్ణ వేడుకుంటుంది. అది కాస్తా ముకుంద చెవిన పడటంతో ముకుందకు తన తండ్రి చేసిన మోసం తెలిసిపోతుంది. వెంటనే మురారి ఉన్న స్టేషన్‌కి వెళ్లిపోతుంది. అప్పటికే మురారీకి ఓపిక ఉండదు. అతడిని వదిలిపెట్టండి అంటు ముకుంద స్టేషన్‌లో గొడవ చేస్తుంది. అయితే పోలీసులు వినరు. వెంటనే ముకుంద ఎవరికో కాల్ చేసి మాట్లాడిస్తుంది. దాంతో పోలీసులు మురారీని విడిచిపెడతారు. కానిస్టేబుల్ మురారీని తీసుకుని వస్తుంటే.. ముకుంద కళ్లనిండా నీళ్లతో.. మురారీ పరిస్థితికి.. ఆవేదనగా చూస్తుంది. ఇక మురారి రాగానే సారీ అని ముకుంద అంటుంది. మీరెవరని మురారి అంటాడు. నేనే ముకుందని అని అంటుంది ముకుంద. అది విని మురారి షాక్ అవుతాడు. నిజమేనా లేక అలా చెప్పినట్లు ముకుంద కల కనిందా.. తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.