Read more!

English | Telugu

తొమ్మిదేళ్ల తర్వాత ఒక డాన్స్ రియాలిటీ షో...


నీతోనే డాన్స్ 2 . 0 మరి గ్రాండ్ గా లాంచ్ కావడానికి సమయం దగ్గర పడిపోయింది. ఇక ఈ షోలో ఒక జోడీగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నేహా చౌదరి, విశ్వా కనిపించబోతున్నారు. ఐతే నేహా దీనికి సంబంధించి ఒక వీడియో చేసింది. ఆ వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. అందులో ఎన్నో ఎక్సయిటింగ్ విషయాలు చెప్తూ ఎంటర్టైన్ చేసింది. తొమ్మిదేళ్ల తర్వాత ఒక డాన్స్ రియాలిటీ షో చేస్తున్నాను అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ షోలో పార్టిసిపేట్ చేయాలనీ చాలా ఎక్సయిటింగ్ గా హ్యాపీగా ఉందని చెప్పింది. ఇక తర్వాత రెడీ అయ్యి ప్రోమో షూట్ కి వెళ్ళిపోయింది.

ఇక తన మేకప్ కిట్ లో మేకప్ బ్రష్ ఉన్న బాక్స్ ని మర్చిపోయి వచ్చిందట అంతే కాదు బ్రేక్ ఫాస్ట్ బాక్స్ కూడా మర్చిపోయానని ఇంట్లో అమ్మ లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పింది. ప్రోమో కాస్ట్యూమ్ ఎప్పుడూ ఛానల్ వాళ్ళే ఇస్తారట ఐతే ఇప్పుడు మాత్రం నచ్చింది తెచ్చుకోమని చెప్పారట.. దాంతో ఆ డ్రెస్ సెలక్షన్ కి రెండు రోజులు పట్టిందని చెప్పింది నేహా. ఐతే హెయిర్ స్టయిల్లో కొన్ని లోపాలు ఉండేసరికి వాళ్ళ డైరెక్టర్ మళ్ళీ చేంజ్ చేయమని చెప్పారట.. ఇక మళ్ళీ హెయిర్ స్టయిల్ ని మార్చుకోవాల్సి వచ్చింది నేహా. ఆదిత్య అనే స్టైలిస్ట్ గురించి వాళ్ళ మేకప్ టీమ్ గురించి చెప్పింది. ఈ టీమ్ తో నేహా రకరకాల షోస్ లో కలిసి వర్క్ చేసిందట. అలాగే ఈటీవీ అభిరుచిలో ఆహార వీధిలో అనే షోలో తన స్టైలిస్ట్ ఆదిత్యతో కలిసి పని చేశానని చెప్పింది. నీతోనే డాన్స్ ప్రోమో కోసం ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 4 ఐనా కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని చెప్పింది. అలాగే ప్రోమో షూట్ లో ఒక సారి పడిపోయింది. రెండో సారి సరిగా చేయలేదు ఇక ముచ్చటగా మూడో సారి ఓకే అయ్యింది. ఐతే ఈ వీడియో ఎవరికీ తెలీకుండా తెస్తున్నానని అని చెప్పి తన పార్ట్నర్ విశ్వని కూడా పరిచయం చేసింది.