Read more!

English | Telugu

కార్తీక దీపం-2 లోను కార్తీక్, దీపలకి కష్టాలు తప్పవంట!

బుల్లితెరపై హిట్ అయ్యే సీరియల్స్ కొన్నే.. అయితే ఆ హిట్ అయిన వాటిల్లో సంచలనం సృష్టించింది ' కార్తీకదీపం'. తెలుగు ప్రేక్షకులు ఆరాధించిన ఈ సీరియల్ రెండవ పార్ట్ సోమవారం నుండి రాత్రి ఎనిమిది గంటలకి స్టార్ మా టీవీలో ప్రసారం కానుంది. దాంతో ఈ సీరియల్ మేకర్స్ నిన్న ప్రసాద్ ల్యాబ్ లో సీరియల్ కి సంబంధించిన ప్రీమియర్స్ వేశారు. అయితే తెలుగు టీవీరంగంలో ఓ సీరియల్ కి ప్రీమియర్స్ వేయడం మాత్రం ఇదే తొలిసారి. మరి అక్కడ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఈ సీరియల్ మేకర్స్ ఏం సమాధానమిచ్చారో ఓ సారి చూసేద్దాం.

తొలి ఎపిసోడ్‌లోని కీలక ఘట్టాలను ప్రివ్యూ వేసి చూపించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి వంటలక్క (ప్రేమీ విశ్వనాథ్), డాక్టర్ బాబు (నిరుపమ్ పరిటాల), దర్శకుడు కాపుగంటి రాజేంద్ర.. నిర్మాత, ఇతర సీరియల్ యూనిట్ పాల్గొన్నారు. అయితే డాక్టర్ బాబు వంటలక్కను చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది మహిళలు రావడం విశేషం. బుల్లితెర చరిత్రలో ఒక సీరియల్‌కి ప్రీ రిలీజ్ నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. ఇంతమంది ఫ్యాన్స్ తరలిరావడం కూడా ఇదే తొలిసారి. అయితే కార్తీకదీపం సీరియల్‌ని ఎంతమంది ఇష్టపడతారో.. ఆ డాక్టర్ బాబు, కార్తీక్‌లను కలిపేయొచ్చు కదా అని డైరెక్టర్‌ని తిట్టుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. దీప, కార్తీక్‌లు కలవాలని, వాళ్లు భార్యాభర్తలుగా కలిసి ఉండాలని, చాలామంది కోరుకున్నారు. సరిగ్గా వాళ్లు కలిసే టైమ్ కి ఏదో ఒక ఆటంకం వచ్చేది. ఇద్దరు విడిపోయేవారు. కార్తీకదీపం సీరియల్ మొత్తం ఇదే లూప్‌లో ఏళ్లకి ఏళ్లు సాగింది. అయితే ఇదే రెండో పార్ట్‌లోనూ కొనసాగబోతుందా? అంటే.. ఔననే అంటున్నారు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. మీడియా సమావేశంలో భాగంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు దర్శకుడు సమాధానమిచ్చాడు. కార్తీకదీపం-2.. తమిళ సీరియల్‌ ‘చెల్లమ్మ’ కి రీమేకా? అని ఒకరు అడుగగా..
అవునండీ.. కార్తీకదీపం కూడా రీమేక్ సీరియలే కానీ మేమ్ చాలా మార్పులు చేశాం. అలాగే సీజన్-2 కూడా చెల్లమ్మ సీరియల్ బేస్ తీసుకున్నాం కానీ చాలామార్పులు చేశానని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

దీప, కార్తీక్‌లకు కార్తీకదీపంలో అన్నీ కష్టాలే.. కనీసం సీజన్ 2 లో అయిన వాళ్లు హ్యాపీగా ఉంటారా అని ఒకరు అడుగగా.. వాళ్లని హ్యాపీగా ఉంచితే జనం చూడరు. కార్తీకదీపం లోని 150 ఎపిసోడ్‌లో కార్తీక్.. దీపని అపార్థం చేసుకున్నాడు. 1000 ఎపిసోడ్‌లో క్షమాపణ చెప్పాడు. 850 ఎపిసోడ్‌ల పాటు ఒకటే సీన్. డాక్టర్ బాబూ నన్ను నమ్మండి అని దీప అంటే నేను నమ్మనని అంటాడు. ఆ ఒక్క సీన్‌తో 850 ఎపిసోడ్ లు నడిపాం, అలాంటివి చాలా ఉన్నాయి. కార్తీకదీపం-2 లో చాలా మార్పులు ఉంటాయి. కార్తీకదీపం సీజన్-1 రామయణం అయితే సీజన్-2 మహాభారతం. చాలా పర్వాలు ఉన్నాయంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. మరి మీలో ఎంతమంది ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.