Read more!

English | Telugu

కీర్తిభట్, కార్తిక్ లని కర్నాటక వెళ్ళిపోండి అంటు నెటిజన్ల కామెంట్స్!

మీది మొత్తం వెయ్యి రూపాయలు రెండు లివర్లు ఎక్స్ ట్రా.. అనే డైలాగ్ తో కుమారీ ఆంటీ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే‌. ఇక ఆమె దగ్గరికి వచ్చి ఎంతోమంది రివ్యూలు వ్లాగ్స్ చేసారు. అందులో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ కీర్తిభట్ కూడా తన భర్త కార్తీక్ తో కలిసి వ్లాగ్ చేసింది‌. అది ఇప్పుడు వైరల్ గా మారింది.

 కీర్తి భట్ తన భర్త కార్తీక్‌తో కలిసి కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ దగ్గరకు వెళ్లారు. అయితే వాళ్లు వెళ్లేసరికి అక్కడ కుమారి ఆంటీ లేదు. సరే ఎలాగూ వెళ్లాం కదా.. కుమారి ఆంటీ ఫుడ్‌ గురించి అంతా ఆహా ఓహో అంటున్నారు కదా.. ఓసారి టేస్ట్ చేద్దామని చికెన్ రైస్ తీసుకున్నారు. అయితే కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేసిన ఈ జంట కంగుతిన్నారు. ఆ చికెన్ కర్రీలో కారం ఎక్కువ వేయడంతో పాటు.. మసాలా కూడా దారుణంగా వేసేయడంతో.. అస్సలు తినలేకపోయారు కీర్తి భట్, కార్తీక్‌లు. అంతా బాగుంది.. బాగుందని అంటుంటే నమ్మి వచ్చాం అని.. తీరా ఆ ఫుడ్ మరీ ఘోరంగా ఉందని.. ప్రచారం తప్పితే ఫుడ్‌లో టేస్టే లేదని.. వేస్ట్ అంటూ రివ్యూ కీర్తిభట్, కార్తిక్ ఇచ్చేశారు.

వీడియో వైరల్ కావడంతో.. కొంతమంది కీర్తి భట్, కార్తీక్‌లు చెప్పింది నిజమే.. కుమారి ఆంటీ ఫుడ్ ఏం బాలేదని.. ప్రచారం ఎక్కువ టేస్ట్ తక్కువ అని మద్దతు ప్రకటించారు. కానీ మరికొందరు మాత్రం.. ఆమె ఏదో కష్టపడుతుంటే.. ఆమె పొట్టకొట్టడం ఎందుకు? రోడ్ సైడ్ ఫుడ్ అంతకంటే బాగుంటుందా? అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్‌లకు వెళ్లినప్పుడు ఇలా చెప్పగలరా? అయినా మీరు కర్ణాటక వాళ్లు.. కారం ఎక్కువ తినరు.. మీకు ఇక్కడ ఫుడ్ నచ్చకపోతే కర్ణాటక దొబ్బేయండి అంటూ కీర్తి భట్, కార్తీక్‌లను తిట్టడం స్టార్ట్ చేశారు. దాంతో స్పందించిన కీర్తి భట్ భర్త.. అసలు మేం అన్నది ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఏంటి? అంటూ వివరణ ఇస్తూ మరో వీడియో విడుదల చేశారు. మేం రీసెంట్‌గా కుమారి ఆంటీ ఫుడ్‌ గురించి ఓ వీడియో చేశాం. దానిపై చాలామంది కామెంట్లు పెడుతున్నారు. 

మేమ్ తెలంగాణా వాళ్లం.. మేమ్ ఆంధ్రా వాళ్లం.. మేమ్ ఎక్కువ కారం తింటాం. మీరు ఎక్కువ కారం తినరు. కారం ఎక్కువైతే మీరు కర్ణాటకకి వెళ్లిపోండని అంటున్నారు. నేను కూడా పక్కా రాయలసీమ వాడినే. నేను కూడా కారం ఎక్కువ తింటాను. నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్లు.. మేం చేసిన పూర్తి వీడియో చూడండి. మేం ఏమన్నామో గమనించండి. మేమ్ చెప్పింది ఏంటంటే.. చికెన్ కర్రీలో కారం గురించి. ఆరోజు మేమ్ అక్కడ తిన్నప్పుడు కూరలో కారం ఎక్కువగా అనిపించింది. మసాలా ఎక్కువనిపించింది. మేమ్ చెప్పడం వల్లే కుమారీ ఆంటీకి ఏదో పెద్ద నష్టం జరిగినట్టు మాట్లాడుతున్నారు. కుమారి ఆంటీకి మా వల్ల బిజినెస్ లాస్ కావడం ఏంటి? తినేవాడు ఎలాగైనా తింటాడు. మేమ్ చెప్పగానే వాళ్లకి లాస్ రాదు. కామెంట్ పెట్టేముందు ఆలోచించి పెట్టండి. కుమారి ఆంటీ కాబట్టి వీడియో చేశారు.. అదే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే ఇలా చెప్తారా అని కీర్తిభట్ భర్త కార్తీక్ అంటున్నారు.