Read more!

English | Telugu

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో ఊహించని ట్విస్ట్..  ఆ బాబు ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -363 లో...కావ్యని తీసుకొని ఇందిరాదేవి సెలెబ్రేషన్స్ దగ్గరికి వస్తుంది. కావ్యని చూసిన కనకం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అల్లుడు వచ్చి ఏం చెప్తాడో అన్న టెన్షన్ ఉందని కూడా ఉందని కనకం అంటుంది. ఆ తర్వాత రాజ్ వస్తాడు. రాజ్ కార్ దిగి కార్ లో ఉన్న ఒక బాబుని తీసుకొని వస్తాడు. రాజ్ ఆ బాబుని ఎత్తుకొని తీసుకొస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు.

ఆ తర్వాత ఎవరు ఆ బాబు అని ఇందిరాదేవి అడుగుతుంది. అలా అందరు ఒక్కొక్కరుగా అడుగుతుంటే... రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అందరు అడుగుతున్నారు కానీ నువ్వు అడుగుతలేవింటని కావ్యతో రాజ్ అంటాడు. నువ్వు అడగకపోయిన నీకు మాత్రమే సమాధానం చెప్పాలని కావ్యని రాజ్ స్టేజి పైకి తీసుకొని వెళ్తాడు. ఈ బిడ్డ ఎవరని అందరు అడుగుతున్నారు కదా.. ఈ బిడ్డ నా రక్తం.. నా కొడుకు అని అనగానే అందరు షాక్ అవుతారు. నువు ఇలా చేసావంటే నేను నమ్మడం లేదని ఇందిరాదేవి అంటుంది. నా కూతురికి అన్యాయం చేశారా అంటూ కనకం ఏడుస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావంటు రాజ్ ని అపర్ణ కోప్పడుతుంది. ఇలా అందరు రాజ్ చెప్పిన దానికి రియాక్ట్ అవుతారు. నా కొడుకుని అన్నావ్ కదా నీ కొడుకు చేసిందేంటని అపర్ణని రుద్రాణి అడుగుతుంది. ఇలా ఒకరు మాటలు అనేలా ఎందుకు ఛాన్స్ ఇచ్చావని రాజ్ ని అపర్ణ అంటుంది. కాసేపటికి రాజ్ ఆ బాబుని తీసుకొని లోపలికి వెళ్తాడు.

అందరు రాజ్ ఇచ్చిన షాక్ లోనే ఉంటారు.  రాజ్ మాటలు గుర్తుకుచేసుకుని కావ్య ఏడుస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వచ్చి.. మీరు నిర్ణయం తీసుకుంటాను అన్నారు. అది ఈ బాబుని తీసుకొని రావడమా అని కావ్య అంటుంది. తరువాయి భాగంలో మీరు బాబు లని తీసుకొని వచ్చిన షాక్ లో.. అసలు బాబు తల్లి గురించి అడగడం మర్చిపోయామని రాజ్ తో కావ్య అంటుంది. నీ కూతురు ఇంట్లో అడుగుపెట్టిన నుండే ఇలా జరుగుతుందని కనకంతో అపర్ణ అనగానే.. నా కూతురికి అన్యాయం జరిగిందని కనకం అంటుంది. తీసుకొని వెళ్ళు నీ కూతురిని అని కనకంతో అపర్ణ అంటుంది. తీసుకొని వెళ్తానని కనకం అంటుండగా.. అప్పుడే కావ్య వచ్చి అమ్మ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.