Read more!

English | Telugu

మూడు ఛానెల్లలో మూడు సీరియల్స్ ప్రారంభం.. సివంగి సీరియల్ అదే రోజున!

ఇక మరికొన్ని రోజులలో టీవీ అభిమానులకి పండగ మొదలవ్వనుంది.  జీ తెలుగు, స్టార్ మా , జెమిని టీవీలలో మార్చి 25 న కొత్త సీరియల్స్ ప్రారంభం కానున్నాయి. జీ తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వారి ' మా అన్నయ్య' సీరియల్, స్టార్ మా టీవీలో ' కార్తీకదీపం- 2'.. జెమిని టీవీలో  ' సివంగి' సీరియల్ ప్రారంభం అవ్వబోతున్నాయి.

ఇక ఒక్కో సీరియల్ ఒక్కో కథతో నవ వసంతంలోకి అడుగెడుతున్నాయి. సీరియల్స్ అంటే ప్రతీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం. చిన్న కూతురు పెద్ద బాధ్యత అనే ట్యాగ్ లైన్ తో ' సివంగి' సీరియల్ ప్రోమో వచ్చేసింది. కథేంటంటే.. ఒక ఊర్లో అమ్మాయి బట్టలు కుడుతూ ఉంటుంది. పేద కుటుంబంలో పుట్టి ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ ఇంటి బాధ్యత చూసుకుంటూ  అమ్మనాన్నలకి ఆర్థిక సాయం చేస్తుంటుంది‌ ఆనంది‌. అదేవిధంగా తన స్నేహితులతో సరదాగా గడుపుతూ జీవితాన్ని సాగిస్తుంది ఆనంది. 

ఊళ్ళో ఏ మనిషికి సాయం కావాలన్నా , ఏ కష్టం వచ్చినా సొంతమనిషిలా సాయపడుతుంది ఆనంది. తన అక్క పెళ్ళిలో ఏర్పడిన అనుకోని సంఘటనల వల్ల ఆనంది.. ఇంటి బాధ్యత తీసుకుని అవి నెరవేర్చడానికి ఆనంది సిటీకి ప్రయాణమవుతుంది. మరి ఆనంది తన అక్క పెళ్ళి చేయగలిగిందా? తిరిగి ఊరికి చేరుకుందా? తెలియాలంటే జెమిని టీవీలో సోమవారం నుండి 7:30 ప్రసారమయ్యే సివంగిని చూసేయ్యండి. ఈ సీరియల్ లో ప్రతిమ, రేణుక, నటకుమారి, చంద్రశేఖర్ , శ్రీప్రియ తదితరులు నటిస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ సీరియల్ ని చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.