English | Telugu

Guppedantha Manasu : శైలేంద్రకి  కొత్త ప్లాన్ చెప్పిన దేవయాని.. అతను ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1147 లో....మహేంద్ర వాళ్ళని అక్కడే ఉండమని దేవయాని అంటుంది. దానికి మహేంద్ర ఒప్పుకోడు.. ఏంటి మహేంద్ర అందరం కలిసి ఉంటే బాగుంటుంది ..ఎందుకు ఇలా చేస్తున్నావని దేవయాని అంటుంది. రిషి వచ్చాక మన జీవితాల్లో వెలుగులు వచ్చాయి.. అందరం కలిసి ఇక్కడే హ్యాపీగా ఉందామని మహేంద్రని ఫణీంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. ధరణి కూడా ఇక్కడే ఉండండి మావయ్య అని అంటుంది. అప్పుడే వసుధార, రిషిలు కాలేజీకి రెడీ అయి వస్తారు. అమ్మ వసుధార ఇక్కడే ఉండమంటున్నారని వసుధారతో మహేంద్ర అంటాడు.

లేదు మావయ్య నాకు ఇక్కడ ఉండాలని లేదు.. వెళ్ళిపోదాం సాయంత్రం కాలేజీ నుండి వచ్చాక వెళదామని వసుధార చెప్తుంది. అన్నయ్య ఏం అనుకోకుండి వసుధారకి నేను ఎదురు చెప్పలేనని మహేంద్ర అంటాడు. మరొకవైపు మను దగ్గరికి ఏంజిల్ , అనుపమ వచ్చి.. రిషి, వసుధారలు తిరిగి వచ్చారంటా కదా.. వసు అనుకున్నది చేసిందని ఏంజిల్ అంటుంది‌. అత్తయ్య మీరు హ్యాపీగా లేరా అని ఏంజిల్ అనగానే.‌. నీ కంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నానని అనుపమ అంటుంది. అయితే మరి వాళ్ళని చూడాలని లేదా అని అంటుంది. ఉంది కానీ కొన్నింటికి సమాధానం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటి బావ అత్తయ్య అలా అంటుంది. రిషి నాకు మంచి ఫ్రెండ్. మనం వెళ్లి. చూసి వద్దామని ఏంజిల్ అంటుంది నేను రాను.. నువ్వు వెళ్ళమని మను అనగానే.. నువ్వు వచ్చేవరకు ఇక్కడే ఉంటానని ఏంజిల్ అంటుంది. దాంతో మను చేసేదేమీ లేక పదా వెళదామని అంటాడు.

మరొకవైపు వసుధారతో రంగా వెళ్ళిపోతే ఎక్కడ దొరికిపోతాడోనని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఆ రంగా గానికి ఆశతో ఇదంతా వదులుకోవడం ఇష్టంలేక నేనే రిషిను అని సెటిల్ అయితే పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చెయ్యలేం అందుకని నేను చెప్పినట్లు చేయమంటూ శైలేంద్రకి దేవయాని ఒక ప్లాన్ చెప్తుంది. మరొకవైపు రిషి వసుధారలు కాలేజీకి వెళ్తారు. రిషి ఎండీ చైర్ ని ప్రేమగా చూస్తుంటాడు. వాళ్ళ ప్రేమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. కాలేజీని చూసి వస్తానంటూ రిషి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.