English | Telugu

Karthika Deepam2 : దీపకి అపోజిట్ గా బలమైన సాక్ష్యాలు.. కార్తిక్ తనని తప్పించగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -117 లో....దీప తన భర్తని వదిలేసి వివాహాతేర సంబంధం పెట్టుకొని తన కూతురిని సరిగ్గా చూసుకోవట్లేదని సాక్ష్యాలున్నాయ్ కాబట్టి నా క్లయింట్ కి న్యాయం చెయ్యాలని కోరుతున్నానని VV జడ్జ్ ని కోరతాడు. నా క్లయింట్ మానసిక స్థితి ఇప్పుడు బాలేదు.. తనని తను నిరూపించకునే సిచువేషన్ లో లేదు దయచేసి వాయిదా వెయ్యాలని కోరుతున్నానని లాయర్ జ్యోతి జడ్జ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో జడ్జ్ వాయిదా వేస్తాడు.

మరొకవైపు ఏం చేసిన శౌర్యని నరసింహా దగ్గరికి వెళ్లకుండా ఎవరు ఆపరు.. బావ కూడ ఆపలేడని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఇలా వాయిదాలు తీసుకోవడం అలవాటని తెలుసు.. మీరేం చేసినా నిజమే గెలుస్తుందని జ్యోతితో VV అనగానే.. అదే అంటున్నా న్యాయం గెలుస్తుందని జ్యోతి అంటుంది. దీప బయటకు వచ్చి బాధపడుతుంటే జ్యోతి, కార్తీక్ వస్తారు. ఇవన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదని జ్యోతి అనగానే.. అవన్నీ అబద్ధాలు మేడమ్ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని కార్తీక్ అంటాడు. దీప పరిస్థితి ఇప్పుడు బాలేదు. తర్వాత మాట్లాడుదామని జ్యోతి అంటుంది. ఆ తర్వాత దీప ఒక దగ్గర కూర్చొని బాధపడుతుంటే నరసింహా, అనసూయ, శోభ వస్తారు. నరసింహా ఇంకా తన మాటలతో దీపని బాధపెడతాడు. ఆ తర్వాత నరసింహా వాళ్ళు వెళ్ళిపోయాక కార్తీక్ వచ్చి.. ఇంటికి వెళదామని అంటాడు. నన్ను కాసేపు వదిలేయండని దీప అంటుంది‌. సరే కానీ శౌర్యని మీ నుండి ఎవరు దూరం చెయ్యలేరు గుర్తు పెట్టుకోండి అని కార్తీక్ అంటాడు.

మరొకవైపు శౌర్య ఆడుకుంటుంటే.. జ్యోత్స్న, పారిజాతం వస్తారు. హాయ్ జో అని శౌర్య అనగానే హ్యాపీగా ఆడుకుంటున్నావ్.. ఆడుకో ఇవ్వాల ఒక్కరోజే.. రేపు మీ నాన్న వచ్చి తీసుకొని వెళ్తాడని జ్యోత్స్న అని వెళ్ళిపోతుంది. నన్ను బూచోడు తీసుకొని వెళ్తాడా అని శౌర్య భయడుతుంటే.. లేదని జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వెళ్లి.. ఎందుకు అలా అన్నావని అడుగుతుంది. కోర్ట్ లో జరిగింది పారిజాతం చెప్పి.. దీప గురించి తప్పుగా మాట్లాడుతుంది. దాంతో పారిజాతంపై సుమిత్ర కోప్పడుతుంది. మరొకవైపు కార్తీక్ తో శ్రీధర్ కోపంగా మాట్లాడతాడు. మీరు పరువు గురించి మాట్లాడకండి నాన్న అంటూ శ్రీధర్ పై కార్తీక్ కోప్పడతాడు. ఆ తర్వాత దీప నడుచుకుంటూ వెళ్తుంటే.. చెప్పు తెగిపోతుంది. అప్పుడే నరసింహా వాళ్ళు దీపతో మాట్లాడాలని కార్ దిగుతాడు. దీప దగ్గరికి వెళ్తుంటే.. దీప తెగిపోయిన చెప్పు విసిరేస్తే, అది నరసింహాపై పడుతుంది. దీన్ని వదిలిపెట్టకూడదని నరసింహా అంటే.. కోర్టులో చూసుకుందామని అనసూయ తీసుకొని వెళ్తుంది. దీప వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.