English | Telugu
Tejaswini Gowda: బిగ్ బాస్ సీజన్ 8 లోకి తేజస్విని గౌడ!
Updated : Aug 7, 2024
బిగ్ బాస్ తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్నా ఈ షో .. ఎనిమిదవ సీజన్ కోసం సిద్ధమవుతోంది.
ఇక ఈ సీజన్ లో ఎవరెవరు వస్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఇప్పటికే కొంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కిర్రాక్ ఆర్పీ , అనిల్ జీలా, యాక్టర్ సనా, వేణు స్వామి , అంజలి పావని, ఫార్మర్ నేత్ర, రీతు చౌదరి, విష్ణు ప్రియ, ఆర్టిస్ట్ ఇంద్రనీల్ జబర్దస్త్ నుండి ఒకరు, ఢీ షో నుండి ఇద్దరు ముగ్గురు వస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా నెట్టింట వైరల్ గా మారిన మరొకరు ఎవరంటే తేజస్విని గౌడ. తను ఈ సీజన్ కి హౌస్ లోకి వెళ్తుందని తెలుస్తోంది. అయితే తనకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.
తేజస్విని గౌడకి ఇన్ స్టాగ్రామ్ లో 513K ఫాలోవర్స్ ఉన్నారు. తను బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్నర్ అమర్ దీప్ భార్య కావడంతో మరింతగా ఈ న్యూస్ ట్రెండింగ్ లోకి ఉంది. అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తేజస్విని గౌడ తనకోసం భారీగా ప్రచారం చేసింది. చాలా కష్టపడి అమర్ దీప్ ని చివరి వరకు తీసుకొచ్చింది. ఇక ఈ సారి తను హౌస్ లోకి వెళ్తే అమర్ దీప్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తారో లేదో చూడాలి. అయితే ఓసారి చాలా మంది తెలిసినవారే వస్తారని బయట ప్రచారం సాగుతోంది. ఈ సీజన్ కి ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్ అంటు నాగార్జున టీజర్ లో చెప్పేశాడు. మరి ఎలాంటి టాస్క్ లు ఉంటాయో? ఎవరెవరు వస్తారోనని బుల్లితెర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.