English | Telugu
Biggboss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లోకి అనిల్ జీల!
Updated : Aug 8, 2024
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 హవా నడుస్తోంది. అందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. గత సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ ప్రస్థానం తర్వాత ఇప్పుడు ఈ సీజన్ కి ఎవరు వస్తారనేది ఫ్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే కొంతమంది బిగ్ బాస్ సీజన్ 8 (Biggboss 8 Telugu) కి కన్ఫమ్ అయినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సీజన్ కి ఫార్మర్ నేత్ర, కిర్రాక్ ఆర్పీ, రీతు చౌదరి, తేజస్విని గౌడ కన్ఫమ్ అయినట్టు నెట్టింట తెలుస్తోంది. అయితే తాజాగా అనిల్ జీల కూడా కన్ఫమ్ అయ్యాడంట. అనిల్ జీల.. హలో వరల్డ్ తో చాలా మంది కి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.
యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీల ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. మరి పల్లె వాతావరణంలో పెరిగిన అనిల్ జీల బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు ఉండగలడా.. ఉంటే అతడు టైటిల్ గెలుచుకోగలడా లేదా అనేది పక్కన పెడితే.. అతను ఈ సీజన్ కి కన్ఫమా కాదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.