English | Telugu
Karthika Deepam2 : అది చూసి తట్టుకోలేక కార్తిక్.. అవి నిందలు కాదు ఆధారాలు!
Updated : Aug 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -116 లో.. లాయర్ VV నరసింహాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. దీప వివాహాతేర సంబంధం పెట్టుకుందని అంటాడు. అందుకు సాక్ష్యమంటూ నా కూతురు స్కూల్ అడ్మిషన్ ఫామ్ లో తండ్రి దగ్గర అతను సంతకం చేసాడు. ఇంకా రెండు సార్లు నా కూతురు హాస్పిటల్ బిల్ కట్టాడు.. అంతేకాకుండా మా అప్పులన్నీ తనే కట్టాడు.. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ నరసింహా అంటాడు. అదంతా అప్పుగా తీసుకున్నానని దీప చెప్తుందిమ మరి దానికి సంబంధించిన సాక్ష్యం ఏదైనా ఉందా అని లాయర్ అడుగగా.. ఏవి లేవని దీప అంటుంది.
ఇవన్నీ ముందే నాకు కార్తీక్ చెప్పి ఉంటే బాగుండు.. అవన్నీ దీప ఒప్పుకుంటుంటే నేనెలా అబ్జెక్ట్ చెయ్యగలనని లాయర్ జ్యోతి అనుకుంటుంది. నేను చేసిన సాయాలన్నీ ఇలా దీప మేడకి చుట్టుకున్నాయని కార్తీక్ అనుకుంటాడు. మీరు మాట్లాడాలి లేదా ? అది నింద కాదు నిజమని ఒప్పుకోవాలని లాయర్ VV అంటాడు. నేను అన్ని నిజాలు చెప్తుంటే ఏం మాట్లాడుతుంది సర్.. కూతురిని సరిగ్గా చూసుకోకుండా ఇబ్బంది పెడుతుంటే.. అది చూసి తట్టుకోలేక నా కూతురిని తెచ్చుకోవడానికి వెళ్తే.. అది నీ కూతురు కాదురా శౌర్య నా కూతురని కార్తీక్ అన్నాడు.. అది దీప ముందే అన్నాడని నరసింహా అనగానే.. నిజమేనా అని VV అడుగుతాడు. అన్నాడని దీప అనగానే.. మరి నువ్వు ఎందుకు అడ్డు చెప్పలేదని లాయర్ అడుగుతాడు. నేను తనతో గొడవపడింది మీరు చూసారా అని దీప అంటుంది.
ఆ తర్వాత నేను వేసేటివి నిందలు కాదు ఆధారాలు ఉన్నాయని లాయర్ అంటాడు. VV పెన్ డ్రైవ్ జడ్జికి ఇవ్వగా.. అందులో శౌర్య హాస్పిటల్ లో ఉన్నప్పుడు మాట ఇచ్చింది. ఆ తర్వాత దీప పడిపోతుంటే కార్తీక్ పట్టుకుంది అదంతా ఉంటుంది. అది చూసిన దీప, కార్తీక్ లు షాక్ అవుతారు. ఆ తర్వాత దీప కళ్ళు తిరిగి పడిపోతుంది. కార్తీక్ ఇంకా జ్యోతి వస్తారు. కార్తీక్ వాటర్ తెచ్చి దీపని లేపుతాడు. చూసారా తన అత్త భర్త ఉన్నా కూడా ఆ కార్తీక్ వచ్చి వాటర్ చల్లి లేపాడు. ఇదంతా పరిగణలోకి తీసుకొని నా క్లయింట్ నర్సింహాకి న్యాయం చేయాలని కోరుతున్నానంటు లాయర్ VV జడ్జి కి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.