English | Telugu
నాకు మొగుడు వద్దు... దేవుడే ముద్దు
Updated : Aug 7, 2024
సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి సీరియల్ ఆర్టిస్టులను పిలిచింది సుమ. శశిధర్, మేఘనా ఖుషి, భార్గవ్, యాష్మి గౌడా, అమర్, మాధవీ లతా అంతా వచ్చారు. రాగానే అందరికీ అరిసెలు ఇచ్చిన సుమ. ఇక అందరినీ ఒక ప్రశ్న అడిగింది. "ఒక వేళా దేవుడు ప్రత్యక్షమైతే ఎం కోరుకుంటారు " అని. దానికి మేఘవ ఖుషి వెరైటీ ఆన్సర్ ఇచ్చింది.
"దేవుడిని అడిగేస్తాను. ఆయనని నా దగ్గరే ఉండిపొమ్మని..ఎందుకంటే దేవుడు నా దగ్గర ఉంటే అన్నీ నా దగ్గర ఉన్నట్టే కదా" అని చెప్పింది. దాంతో సుమ "తధాస్తు...నీకు పతి దేవుడు దొరుకుతాడు" అని మొగుడు దొరుకుతాడు అని ఆశీర్వదించేసరికి మేఘనా భయపడిపోయింది. "అమ్మో వొద్దు" అనేసింది..మొగుడు వొద్దు అంటుంది ఏమిటా అన్న లెక్కలో చూసారు మిగతావాళ్లంతా. తర్వాత మీరేమని అడుగుతారు దేవుడిని అని సుమ అమర్ ని అడిగింది. "సుమ గారి లాంటి అమ్మాయి వైఫ్ గా వస్తే బాగుండు" అని ఆన్సర్ ఇచ్చేసరికి సుమ నోరెళ్లబెట్టింది. "అదేంటి నేను అరిసెలు ఇస్తే ఆయన బిస్కెట్ ఇచ్చాడు" అంటూ కౌంటర్ వేసింది సుమ. "భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పని ఏమిటి" అని సుమ అడిగేసరికి ఒక స్టూడెంట్ లేచి "నడుము గిల్లొద్దు" అని చెప్పేసరికి సుమ ఒక లుక్కిచ్చింది. "పని మనిషితో క్లోజ్ గా మాట్లాడ్డం" అని మరో లేడీ స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చింది. దానికి సుమ "పనిమనిషితోనే కాదు ఏ మనిషితో కూడా మాట్లాడకూడదు" అని సీరియస్ గా ఆన్సర్ ఇచ్చింది.