English | Telugu

Eto Vellipoyindhi Manasu :  రామలక్ష్మి అసలు నిజం తెలుసుకుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -169 లో....సీతాకాంత్ రాజీనామా చేస్తున్నట్లు సంతకం చేస్తుంటే రామలక్ష్మి వెళ్లి ఫైల్ లాక్కుంటుంది. మీరు ఇప్పుడు సంతకం చేస్తే చెయ్యని తప్పుని మీరే ఒప్పుకున్నట్టు అవుతుందని రామలక్ష్మి అంటుంది. మరి ఇప్పుడు వేరే దారి లేదని సీతాకాంత్ అనగానే.. నాకు ఒక్క రోజు టైమ్ ఇవ్వండి. కంపెనీని మిమ్మల్ని కాపాడుకుంటానని రామలక్ష్మి అనగానే.. నీపై నమ్మకం పోగొట్టుకున్నానని సీతాకాంత్ అంటాడు. సరే అంటూ రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి, పెద్దాయన, శ్రీలత ఇంటికి వస్తారు.

ఆ తర్వాత రామలక్ష్మి ఆలోచిస్తూ కళ్ళు తిరిగిపడిపోతుంది. వెంటనే శ్రీలత, పెద్దాయన కూర్చోబెడతారు. ఎందుకు అమ్మ టెన్షన్ .. సరిగ్గా తినడం లేదు... రెస్ట్ తీసుకోమని పెద్దాయన అంటాడు. లేదు తాతయ్య నాకు ఉంది ఒక్కటే రోజు.. ఈ లోపు కంపెనీని తనని సేవ్ చెయ్యాలని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత పెద్దాయన వెళ్ళిపోయాక.. నీకెందుకు రామలక్ష్మి ఇవ్వన్నీ , నాకు అడ్డు రాకు అని శ్రీలత అంటుంది. నేను మీ గురించి బయటపెట్టి తీరుతానని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు శ్రీవల్లి తన చైర్మన్ అవుతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సందీప్ వస్తాడు. శ్రీలత కూడా వస్తుంది. కంపెనీకి నా భర్త చైర్మన్ అయ్యాక ఇంట్లో పెత్తనం నాదే అంటూ శ్రీలతని బెదిరిస్తున్నట్లు ఉహించుకుంటుంది. రామలక్ష్మి ని ఓడించాలి మనం అనుకున్నది జరగాలంటే ఆ నమితని మూడో కంటికి కూడా తెలియకుండా చూసుకోవాలని సందీప్ కి శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి దేవుడికి మొక్కుతూ.. నాకు ఎలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చెయ్యాలో తెలిసేలా చేసావని హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత రామలక్ష్మి సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి.. మొన్న ఒక అమ్మాయి వచ్చింది కదా.. ఆవిడ ఎలా వెళ్ళిందని అడుగుతుంది. కార్ లో వెళ్ళిందని అనగానే నెంబర్ ఏదైనా ఐడియా ఉందా అని అడుగుతుంది. లేదని అనగానే ఏదయినా గుర్తులు ఉన్నాయా అని రామలక్ష్మి అనగానే గద్ద బొమ్మ స్టిక్కర్ ఉందని సెక్యూరిటీ చెప్పగానే.. రామలక్ష్మి హడావిడిగా వెళ్తుంది. అది చూసి సందీప్ దగ్గరికి శ్రీలత వచ్చి.. రామలక్ష్మి ఎక్కడికో హడావిడిగా వెళ్తుంది. ఏదైనా క్లూ గాని దొరికిందా అంటుంది. మరొకవైపు రామలక్ష్మి క్యాబ్ ఓనర్ దగ్గరికి వెళ్లి కనుక్కుంటుంది. అప్పుడే గద్ద బొమ్మ ఉన్న కార్ వస్తుంది. అప్పుడే అతను స్టికర్ తీసేస్తాడు. ఆ పడేసిన స్టికర్ చూసి ఏ కార్ ది అని చూసి ఆ కార్ ఎవరిది అని అడుగగా ఆ కార్ అతను వస్తాడు. అతనికి నమిత ఫోటో చూపించి అడుగుతుంది‌ మొన్న క్యాబ్ బుక్ చేసుకుందనగానే గుర్తు వచ్చిందని అతను అంటాడు. ఎక్కడ దింపారో చెప్పండని రామలక్ష్మి అనగానే.. అతను చెప్తాడు. దాంతో వెంటనే రామలక్ష్మి అక్కడికి బయలుదేర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.