English | Telugu
Brahmamudi : అప్పుని పెళ్ళి చేసుకున్న కళ్యాణ్.. షాక్ లో దుగ్గిరాల కుటుంబం!
Updated : Aug 8, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -482 లో.....రుద్రాణి , ధాన్యలక్ష్మి లు అప్పుపై నిందలు వెయ్యడం వళ్లే పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతో ఇందిరాదేవి వాళ్ళని తిడుతుంది. మరొకవైపు కంగ్రాట్స్ అప్పు సక్సెస్ ఫుల్ గా నీ పెళ్లి ఆగిపోయింది.. అక్కడ పెద్ద కురుక్షేత్రమే జరిగింది అంట అని అప్పుతో అనామిక చెప్తుంటుంది. గెలిచానని సంబరపడిపోకు నా నుండి నువ్వు తప్పించుకాలేవని అప్పు అనగానే.. ముందు ఇక్కడ నిన్ను ఎవరు కాపాడుతారంటూ అనామిక అంటుంది. అప్పుడే కళ్యాణ్ బంటి ని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ రౌడీ లని కొడతాడు. ఇప్పుడు అంటే కాపాడావ్.. అలా ఎప్పుడు చెయ్యలేవు కదా అని అనామిక అంటుంది.
అప్పుని ఎప్పుడు కాపాడుకుంటానంటూ అప్పు చెయ్ పట్టుకొని కళ్యాణ్ తీసుకొని వెళ్తాడు. రాహుల్ మనం వెళదామని రుద్రాణి అంటుంది. నన్ను వదిలేసి వెళ్తారా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకు ఇక్కడ అందరితో మాటలు పడడానికా.. అయిన నువ్వు ఇక్కడ ఎందుకు? వాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటారు.. ఇంట్లో అన్ని సిద్ధం చెయ్యాలి కదా అని రుద్రాణి అనగానే.. అప్పుడే అప్పుని కళ్యాణ్ తీసుకొని వస్తాడు. నీకు అసలు అప్పు కుటుంబం గురించి అప్పు గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావని రుద్రాణిపై కోప్పడతాడు కళ్యాణ్. మరి అప్పు నీతో ఎందుకు ఉందని ధాన్యలక్ష్మి అనగానే.. అప్పుని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు నీ ముద్దుల కోడలు అనామిక అనగానే.. అందరు షాక్ అవుతారు. జైల్లో ఉంది ఎలా కిడ్నాప్ చేస్తుందని రుద్రాణి అనగానే... నేనే చూసాను కళ్యాణ్ కి చెప్పానని బంటి అంటాడు. నాకు చెప్పగానే వెళ్ళాను.. తను జైలు కి వెళ్లాడనకి కారణం అప్పు కారణమని తనని కిడ్నాప్ చేసి పెళ్లి ఆగేలా చేసింది. రుద్రాణి మా అమ్మ అన్న మాటల వల్లే కదా పెళ్లి ఆగిపోయింది. అంటీ మీ కూతురు ఎలా వెళ్లిందో అలా వచ్చిందని కనకంతో కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కనకం బాధపడుతూ రుద్రాణి, ధాన్యలక్ష్మిలని తిడుతుంది.
నా కూతురు నా ఇంటికి వచ్చింది చాలు అని కృష్ణమూర్తి అంటాడు. ఇలా జరిగాక నా కూతురికి పెళ్లి అవుతుందా అని కనకం ఎమోషనల్ అవుతుంటే.. అవుతుందంటూ రాజ్ తాళి తీసుకొని వచ్చి.. కళ్యాణ్ కి ఇచ్చి కట్టరా అనగానే కళ్యాణ్ అప్పు మెడలో తాళి కడతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో నేను అడిగినప్పుడు అప్పు మనసులో లేదన్నారు.. నాకు అబద్ధం చెప్పారా లేకపోతే అప్పుని ఇప్పుడు మోసం చేసారా అని కావ్య అంటుంది. ఆ తర్వాత అది నాకు కోడలుగా ఇంట్లో అడుగుపెట్టొద్దని ధాన్యలక్ష్మి అనగానే అప్పుని తీసుకొని నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.