English | Telugu

ఆ కోరిక కోసం కాదు పెళ్లి అంటే... ఇలా నీచంగా ఎవరూ మాట్లాడరు

లేడీస్ లో ట్రెండింగ్, డేర్ అండ్ డ్యాషింగ్ గా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే అనసూయ, రష్మీ, మాధవీలత, చిన్మయి శ్రీపాద. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో చేసేస్తారు అని భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. అలాంటిది ఇప్పుడు మాధవీలత సీనియర్ సిటిజన్స్ పెళ్లి గురించి మాట్లాడింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. ఐతే ఈ మధ్య కాలంలో బాగా వయసైపోయిన వాళ్ళు, పిల్లలు వదిలేసినా వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఇలా చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ చాలామంది ఈ విషయాన్ని బూతద్దంలో చూస్తూ ఇప్పుడు పెళ్లేంటి, ఇప్పుడు సెక్స్ ఏంటి, ఇప్పుడు పిల్లల్ని కంటారా అని వాళ్ళను బాధపెడుతున్నారు.

కానీ పెళ్లంటే ఇవే కాదు. చచ్చే వరకు తోడుగా ఉండడం కోసం మనకంటూ ఒకరు ఉన్నారని చెప్పడం కోసం. పెళ్లి, పిల్లలు అన్ని కూడా ఒక ఏజ్ వరకే. ఆ తర్వాత పిల్లల్ని ఒక దారి చేసాక మిగిలేది ఆ భార్య భర్తలే. ఒక వేళా అందులో ఎవరు చనిపోయినా మరో వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నారు అంటే దాని అర్ధం వాళ్లకు ఆరోగ్యం బాగోకపోయినా, మనసు బాగోకపోయిపోయినా, కష్టం, సుఖం మాట్లాడుకోవడం కోసం మాత్రమే ఈ పెళ్లి అనేది. ఒక ఏజ్ కి వెళ్ళాక, పిల్లలు, చుట్టాలు, ఈ సమాజం వాళ్ళను పట్టించుకోవడం మానేస్తుంది. వయసైపోయాక పెళ్లి చేసుకుంటున్నారు అంటే అందరూ ఆ కోరికల కోసం అని ఊహించేసుకోవడం చాలా తప్పు. ముందు తోడు-నీడ అనే పదాలకు అర్ధం తెలుసుకోండి. అవి తెలిస్తే ఇలా నీచంగా ఎవరూ మాట్లాడరు..." అంటూ మాధవీలత సొసైటీలో ఇలా నీచంగా ఆలోచించే వాళ్ళ గురించి ఇచ్చి పడేసింది. దాంతో నెటిజన్స్ కూడా ఆమె మాటలకు ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.