English | Telugu
రష్మీతో మడతపెట్టిన శేఖర్ మాస్టర్
Updated : Aug 7, 2024
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఇంద్రజని ఆది జానకి గారితో పోల్చాడు. "సెట్ లో ఎవరైనా కొత్తగా వచ్చి ఒక సాంగ్ పాడితే ఎంకరేజ్మెంట్ కోసం ఇంద్రజ గారు ఒక సాంగ్ పాడతారు" అని ఆది చెప్పాడు. "ఆది గారు ఉన్నప్పుడు అసలు పాడదల్చుకోలేదు" అని ఇంద్రజ కౌంటర్ వేసింది. దానికి ఆది మళ్ళీ రివర్స్ కౌంటర్ వేసాడు. "నేనుంటే ఇంద్రజ గారు, లేకుంటే జానకి గారు" అన్నాడు దణ్ణం పెడుతూ. ఆవిడ ఆది డైలాగ్ కి పడీపడీ నవ్వుకుంది. ఇక ఈ ఎపిసోడ్ లో కొత్త సినిమా వాళ్ళు వెర్సెస్ పాత సినిమా వాళ్ళ మధ్య కాంటెస్ట్ నడిచింది. ఇక ఈ షోకి శివమ్ భజే మూవీ నుంచి హీరో హీరోయిన్స్ అశ్విన్, దిగంగన సూర్యవంశీ వచ్చారు. అలాగే కొరియోగ్రాఫర్ శేఖర్ మాష్టర్ వచ్చాడు. "ఆ కుర్చీని మడతపెట్టి" అనే సాంగ్ కి రష్మీతో కలిసి డాన్స్ చేసాడు.
ఇక ఇందులో డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ మాష్టర్ కి అలాగే డాన్స్ చేసిన వంశికి తన నెక్స్ట్ మూవీలో ఏదో ఒక ఛాన్స్ కచ్చితంగా ఇస్తానని అశ్విన్ ప్రామిస్ చేసాడు. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమోని చూసిన నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు.పాత సినిమాలే సూపర్. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు. 100 డేస్ నుంచి 500 డేస్ ఆడిన సినిమాలు ఉండేవి . అప్పట్లో ప్రొడ్యూసర్ కి ఒక వేల్యూ ఉండేది. ఇప్పుడు అంతా ఇష్టం ఐపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.