English | Telugu
పరారీలో రాకీ MD.. అంతా తూచ్ అంటున్న సుమ!
Updated : Aug 7, 2024
రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ ఫ్లాట్‌లను అమ్మడానికి, ప్రజలను అట్ట్రాక్ట్ చేయడానికి సుమతో యాడ్స్ చేయించిన విషయం తెలిసిందే. ఐతే ఇక్కడ ప్లాట్స్ కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించి చాలా కుటుంబాలు మోసపోయాయని అలాగే రాకీ అవెన్యూ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు పరారీలో ఉన్నారని, తన కస్టమర్లకు ఏ మాత్రం స్పందించడం లేదని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో రాఖీ అవెన్యూస్ రియల్ ఎస్టేట్ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్-2 పేరుతో ప్లాట్లు కట్టించి ఇస్తామని తమవద్ద నుంచి సుమారు రూ.16 కోట్లు పైబడి పెట్టుబడిగా డబ్బులు కట్టించుకుని మోసం చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుమ ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు.
రాకీ అవెన్యూస్‌తో తన అనుబంధాన్ని తెలియజేస్తూ కొన్ని ప్రకటనలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఐతే 2016 నుండి 2018 వరకు జాబ్ లో భాగంగా చేసిన యాడ్స్ అని అవి ఇప్పుడు చెల్లవు అని చెప్పారు సుమ. ప్రస్తుతం ఈ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఒక పోస్టర్ ని తన ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేశారు. ఐతే ఈ కంపెనీతో లావాదేవీలు చేసుకున్నవారికి న్యాయం చేయాలనీ తాను కోరుతున్నట్లు చెప్పారు. ఎలాంటి ప్రకటన ఐనా కూడా దాన్ని కంఫర్మ్ చేసుకోకుండా, అఫీషియల్ గా నిర్ధారించుకోకుండా ముందుకు అడుగు వేయొద్దంటూ చెప్పారు సుమ. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని కూడా అన్నారు.