English | Telugu
నేను పెళ్లి చేసుకుంటే మీరే ఫీలవుతారు...
Updated : Mar 30, 2024
విజయ్ దేవరకొండ నటించిన ఫామిలీ స్టార్ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబందించిన ప్రమోషన్స్ బాగా చేస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా బుల్లితెర నటి తేజస్విని గౌడతో చిట్ చాట్ చేసాడు. ఈ చిట్ చాట్ లో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. " నా దృష్టిలో ఫామిలీ మ్యాన్ అంటే ఇంట్లో అందరి మీద శ్రద్ద వహించాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి ...ఫామిలీ కోసం పని చేయడమే కాదు వాళ్లకు తగినంత ప్రేమను కూడా పంచాలి...వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇంట్లో మా అత్తలు, పెద్దమ్మలు ఇలాగా పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయిలే ఫీలవుతారు.. ఒకవేళా చేసుకోవాల్సి వస్తే చెప్పే చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంట్లో అమ్మలా నన్ను, పిల్లల్ని, ఇంటిని చూసుకునే ఒక కేంద్ర బిందువులా ఉండాలి. ఇంటెలిజెంట్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నాకు ట్రావెలింగ్ అన్నా, ఫుడ్ అన్నా చాలా ఇష్టం. ఇవన్నీ ఎంజాయ్ చేసే అమ్మాయి కావాలి. నా వర్క్ కి సంబంధించిన విషయాలను నాన్నతో, ఎమోషనల్ విషయాలను అమ్మతో షేర్ చేసుకుంటా. ఐతే వీళ్ళిద్దరితో చెప్పలేని విషయాలను తమ్ముడితో షేర్ చేసుకునేవాడిని...ఇద్దరం అడల్ట్స్ అయ్యాము..కాబట్టి ఏ విషయం ఐనా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం.." అని చెప్పాడు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. నిజానికి గతసంక్రాంతికే వస్తుందని భావించినా కాస్త ఆలస్యమయింది. ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. లైగర్, ఖుషీ వంటి ఫ్లాప్ మూవీస్ తో వెనకబడిన విజయ్ దేవరకొండకు ఈ ఫ్యామిలీ స్టార్ ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.