English | Telugu
యూఎస్ఏ టూర్ లో ఆర్జే కాజల్ !
Updated : Mar 30, 2024
హోమ్ సిక్.. టూర్స్.. ట్రావెల్స్.. ఇలా అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. కొందరు బిజినెస్ పనుల మీద విదేశాలకి వెళ్తుంటారు. అయితే అక్కడి వాతావరణం బాగున్నప్పటికి సొంత ఊరిని, సొంతింటి మనుషులని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఎప్పటికి ఉంటుంది. అదే విషయం చెప్తూ ఆర్జే కాజల్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ చేసింది.
సేవ్ ది టైగర్స్ సీజన్ 2 లో ఓ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్జే కాజల్ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఎన్నో సినిమాల్లో తన గొంతుతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడేమో అమెరికాకి వెళ్ళింది. అక్కడ తను ఉన్న గదిని, అక్కడ ఫేమస్ హోటల్స్ ని, కేఫ్ లని చూపిస్తూ ఓ వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. అక్కడ విలేజ్ స్క్వేర్ కేఫ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళగా.. అక్కడ గోడలకి ఉన్న సైకిళ్ళని చూసి ఫిధా అయింది కాజల్. ఇక అక్కడి హోటల్ ప్రత్యేకతలు వారి భాషని , అలవాట్లని, అభిరుచులని తెలియజేస్తూ ' సియాటెల్ లో నా డే-1 ' అనే టైటిల్ తో యూఎస్ టూర్ ని అప్లోడ్ చేసింది. అది ఇప్పుడు యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది.
ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5 ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. మరి మీలో ఎంతమంది తనని ఫాలో అవుతున్నారు. మీరు తన యూట్యూబ్ ఛానెల్ లో చూసిన వ్లాగ్ ఏంటి కామెంట్ చేయండి.