English | Telugu
ఈ డార్క్ సైడ్ కటౌట్ హోస్ట్ ఎవరై ఉంటారు
Updated : Mar 31, 2024
ఉగాది పండగ మరి కొద్ది రోజుల్లో రాబోతోంది. ఇక ప్రధాన ఛానెల్స్ అన్నీ కూడా వాటి వాటి కార్యక్రమాలను మొదలు పెట్టేశాయి. ఐతే అన్ని షోస్ కి ఒక్క శ్రీముఖి మాత్రమే చేసే పరిస్థితి ఉండదు కదా... అందుకే ఉన్న యాంకర్స్ తో పాటుగా బుల్లితెరకు కొంచెం దూరంగా ఉన్న యాంకర్స్ ని కూడా తీసుకురాబోతున్నారు షో మేకర్స్. మరి ఇప్పుడు మల్లెమాల వాళ్ళు అదే పని చేశారు. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజీలో డార్క్ సైడ్ పిక్ ఒకటి పెట్టి "ఈసారి ఈటీవీ ఉగాది ఈవెంట్ ని ఎవరు హోస్ట్ చేయబోతున్నారో గెస్ చేయండి...అని అడిగారు...ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ ఇయర్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది" అని టాగ్ లైన్ కూడా పెట్టారు. ఇక ఆ డార్క్ సైడ్ ఫోటో చూసిన నెటిజన్స్ అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. "మా బాస్ సుధీర్ అన్నా, మా దేవుడు సుధీర్ అన్నా" అంటూ సుధీర్ జపం చేస్తూనే ఉన్నారు. ఇంకొంతమందైతే హోస్ట్ ప్రదీప్ అని ఇంకొందరు వెరైటీగా విజయ్ దళపతి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరైతే ఏమనుకుంటున్నారు ?...
ఆల్రెడీ సుధీర్ మల్లెమాల ప్రోగ్రామ్స్ అన్నిటికీ యాంకర్ గా వ్యవహరించి సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్ళాడు...అక్కడ కొన్ని మూవీస్ లో నటించాడు. ఐతే ఇప్పుడు ఇక మరిన్ని అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి ప్రదీప్ కూడా బుల్లితెర మీద ఎన్నో షోస్ కి హోస్ట్ గా చేసాడు...ఐతే ప్రదీప్ కొన్ని నెలలుగా బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు. మరి డార్క్ సైడ్ కటౌట్ ఎవరిదబ్బా అని ఆలోచిస్తున్నారు నెటిజన్స్...సుధీర్ ఐతే మాత్రం ఆడియన్స్ కి నిజమైన ఉగాదే అని చెప్పొచ్చు. ప్రదీప్ ఐనా కూడా ఆడియన్స్ కి ఓకేనే...మరి ఈ ఇద్దరిలో ఎవరై ఉంటారు గెస్ చేయండి అంటూ ఒక పజిల్ ని నెటిజన్స్ కే వదిలేశారు. మరి చూడాలి ఈ ఇద్దరిలో ఎవరు అనేది.