English | Telugu

సెగలు రేపిన బిగ్ బాస్ నయని పావని.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

సోషల్ మీడియా గురించి తెలిసిందే కదా.. మంచివాడిని కూడా ముంచేవాడిలా చేస్తోంది. కొంచెం చెడుగా ఆలోచించేవాళ్ళని మరింత చెడగొడుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో కొందరు సెలబ్రిటీలు శారీ డ్రాపింగ్ అంటూ ఫోటోషూట్స్ అనగానే ఆ ఫోటోలన్నింటిని చూడడానికి కరువు ప్రాంతం నుండి వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటారు.

తాజాగా బిగ్ బాస్ నయని పావని తన ఇన్ స్టాగ్రామ్ లో‌ పింక్ కలర్ చీరలో ఓ రీల్ ని షేర్ చేసింది. ఇందులో నయని పావని లిరిక్స్ తగ్గట్టుగా మూమెంట్స్ చేస్తుంటే.. తన నడుముతో పాటు నాభి కూడా దర్శనమిచ్చింది. ఇక అది కనిపించిందో లేదో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. చిట్టి నడుము సూపర్ అని ఒకరు.. అబ్బ ఏం ఉన్నావు అంటూ మరొకరు.. ఫీస్ట్ అదిరింది అని ఇంకొకరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా కరువులో అరువు కోసం వెతుకుతుండగా.. ఫ్రీగా కేకు దొరకితే ఎలా తింటారో అలా తనని కామెంట్లతో సాధిస్తున్నారు. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్. ప్రతీదీ వల్గర్ అండ్ బోల్డే. పాజిటివ్‌ కామెంట్లు కూడా చాలా తక్కువే.‌

బిగ్‌బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చింది నయని పావని. అయితే ఉన్నది ఒక వారమే అయినా ఆడియన్స్‌కి మాత్రం బాగానే కనెక్ట్ అయింది. ముఖ్యంగా శివాజీతో నయని పావని మాట్లాడిన విధానం అందరికీ తెగ నచ్చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌‍లో మ్యూజిక్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది.

బిగ్‌బాస్ బ్యూటీ నయని పావని ఇటీవల ప్రిన్స్‌ యావర్‌తో కలిసి నీతోనే డ్యాన్స్‌షోలో సందడి చేసింది. అయితే ఒక్క వారంలోనే ఈ షోకి గుడ్ బై చెప్పేసింది నయని. ఇక ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా చీరలో వయ్యారాలు ఒలకబోయగా అవి నెటిజన్లకి ట్రీట్ లా‌ అనిపిస్తున్నాయి. మరి మీలో‌ ఎంతమందికి నయని పావని తెలుసు? ఎలా తెలుసో కామెంట్ చేయండి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.