English | Telugu

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన సిరి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -60 లో... రామలక్ష్మి, సీతాకాంత్ ల దగ్గరికి మాణిక్యం, అతని భార్య సుజాత, ధన వస్తారు. రామలక్ష్మికి వాళ్ళ అమ్మ సుజాత జాగ్రత్తలు చెప్తుంది. అమ్మ నా పరిధి ఏంటో నాకు తెలుసు, ఇక పదే పదే ఈ విషయం గురించి మాట్లడకని సుజాతతో రామలక్ష్మి అంటుంది.

ఇక ఆ తర్వాత ధన దగ్గరికి సిరి వచ్చి బయటకు రమ్మని సైగ చేయగా.. రామలక్ష్మితో వాష్ రూమ్ కి అని చెప్పి తనని కలవడానికి వెళ్తాడు. బయట ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. మా అన్నయ్య, వదినల మధ్య దూరం ఉంది‌. వాళ్ళిద్దరు మనకోసమే పెళ్ళి చేసుకున్నారని ధనతో సిరి చెప్తుంది. అవును వారికి మనం ఋణపడి ఉన్నామని ధన అనగానే.. ఆ ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది, వారిని కలపాలని సిరి అంటుంది‌. దానికి ధన ఒప్పుకుంటాడు. ఇక ఇంట్లో ఉన్న అందరిని పిలిచిన మాణిక్యం.. తన మాటని చెప్పాలని అనుకుంటాడు.‌ నా చెల్లి, ధనలకి పెళ్ళి చేయమని సీతాకాంత్ అనగా.. అది జరగదని ఓ ఆరు నెలల తర్వాత చేస్తానని మాణిక్యం అంటాడు. ఏ ఏమైంది నువ్వు చెప్పినట్టే రామలక్ష్మి, నేను పెళ్ళి చేసుకున్నాం కదా ఇప్పుడేంటి అని సీతాకాంత్ అడుగగా.. నా కూతురు నెల తప్పాలి అని మాణిక్యం అంటాడు. దాంతో ఇంట్లోని వాళ్ళంతా షాక్ అవుతారు. ఇప్పుడు ధన, సిరిల పెళ్ళి చేస్తే నా కూతురిని బయటకు గెంటేస్తారు. అదే నా కూతురు నెల తప్పితే ఈ ఇంటి కోడలిగా నా కూతురు స్థానం బలంగా ఉంటుందని మాణిక్యం అంటాడు. రామలక్ష్మి రిక్వెస్ట్ చేయగా.. లేదు నీ కడుపు పండిందనే శుభవార్త నేను వినాలి, అప్పుడే ధన, సిరిల పెళ్ళికి శుభముహూర్తం పెట్టిస్తానని మాణిక్యం అనగానే.. సీతాకాంత్ కోపంతో ఊగిపోతూ మాణిక్యం మెడలోని కండువాతో అతని గొంతు నులిమేస్తుంటాడు. అది చూసిన సీతాకాంత్ వాళ్ళ తాత అతనిని పక్కకి లాగేస్తాడు. ఇక మాణిక్యాన్ని బయటకు గెంటేస్తాడు సీతాకాంత్ . బయటకొచ్చిన మాణిక్యం.. ధన, సుజాతలని ఆటోలో కూర్చోమని చెప్పి తిరిగి ఇంటిలోకి వస్తాడు.

ఇంట్లోకి వచ్చిన మాణిక్యం.. సీతాకాంత్ వాళ్ళ అమ్మని చెల్లెమ్మ అని పిలవకుంటా శ్రీలత అని పిలుస్తాడు . అది విన్న శ్రీలత ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావని అడుగుతుంది‌. ఈ ఇంట్లోకి నా కూతురు రూపంలో నీ పతనానికి మందుపాతర పాతానని మాణిక్యం అనగానే శ్రీలత షాక్ అవుతుంది. అసలు విషయాలు బద్దలై బయటకొచ్చిన రోజున నీ పరిస్థితి ఎంత దారణంగా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నానని శ్రీలతతో మాణిక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సిరి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంటుంది‌‌. అలా తన ఏడవటం చూసిన రామలక్ష్మి.. బాధపడకు సీతాకాంత్ సర్ మీ పెళ్ళి చేస్తానని చెప్పారు కదా అని రామలక్ష్మి అంటుంది. లేదు అది సాధ్యం కాదు.. మా అన్నయ్య నాకోసమే చాలా తగ్గాడు.. అవమానాలు భరించాడు‌. మా పెళ్ళికి లేట్ అయ్యేకొద్ది ఎక్కడ నా కారణంగా మా అన్నయ్య పరువు పోతుందోనని సిరి అంటుంది. సిరి నువ్వేం మాట్లాడుతున్నావా నాకు అర్థం కావడం లేదని రామలక్ష్మి అడుగగా.. నేను ప్రెగ్నెంట్ అని సిరి చెప్తుంది. అది విని రామలక్ష్మి షాక్ అవుతుంది‌. సిరి నువ్వు చెప్పేది నిజమా? నువ్వు ప్రెగ్నెంటా అని ఆశ్చర్యంగా రామలక్ష్మి అనగా‌.. అవునని సిరి అంటుంది. నా కారణంగా మా అన్నయ్య పరువు పోయి ఆయన తలదించుకునే పరిస్థితి వస్తే నేను బ్రతకలేను వదిన.. నా బాధకి, భయానికి కారణమిదే వదిన అని రామలక్ష్మితో సిరి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.