English | Telugu

Karthika Deepam2 : నువ్వు పనిమనిషి కూతురివి.. షాక్ లో జ్యోత్స్న!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -139 లో.... వచ్చాక ఒక విషయం చెప్తానని కార్తిక్ కి ఫోన్ లో చెప్తుంది దీప. ఆ తర్వాత శౌర్య వచ్చి అమ్మ ఫోన్ చేసిందా అని అడుగుతుంది. హా ఇప్పుడే చేసింది బయలుదేరారట.. ఆలోపు మనం సరదాగా బయటకు వెళదామని శౌర్యని తీసుకొని కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు సుమిత్ర దాస్ అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. పారిజాతం వెళ్తుంటే.. అత్తయ్య మీతో జ్యోత్స్న గురించి మాట్లాడాలని అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి నా గురించి గ్రానీ తో ఎందుకు మాట్లాడ్డడమని జ్యోత్స్న అంటుంది. చిన్నచిన్న పొరపాట్లకి కూడ ఒక్కొక్కసారి పెద్ద శిక్ష పడుతుందని సుమిత్ర అనగానే.. అవును దీప నిన్ను కాపాడిందని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే.. ఇప్పుడు నాకే తలనొప్పిగా తయారైందని జ్యోత్స్న అంటుంది.

Eto Vellipoyindhi Manasu : అర్థరాత్రి భార్యాభర్తల ముచ్చట్లు.. అత్త మాస్టర్ ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -191 లో.....రామలక్ష్మి శ్రీలత గదిలోకి వెళ్లి పడుకుంటుంది. దాంతో సీతాకాంత్ లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. తన పక్కన రామలక్ష్మి ఉందని ఉహించుకొని తన మనసులో మాటలు చెప్తుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి.. ఏంటి మనవడా నిద్ర రావడం లేదా అని అడుగుతాడు. తాతయ్య నువ్వా అంటూ సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. అందుకే నీ మనసులో మాటని నీ భార్యకి చెప్పమని చెప్పానంటూ పెద్దాయన అంటాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి.. అమ్మ దూరంగా ఉండమని చెప్పింది కదా అని సీతాకాంత్ అంటాడు.

Brahmamudi : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూపర్ ట్విస్ట్.. రాహుల్ అరెస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -504 లో..  కళ్యాణ్ తో అటో దిగాక కావ్య మాట్లాడుతుంది. నువ్వు ఎంచుకున్న దారి కరెక్ట్ కానీ అక్కడే ఆగిపోకు.. ఇదే నీ గోల్ కాదు.. నీ గోల్ ని చేరుకోవడానికి ఇది ఒక దారి అని కళ్యాణ్ ని కావ్య మోటివేట్ చేస్తుంది. నువ్వు అనుకున్నది.. నువ్వే సాధించి చూపించపని కావ్య వెళ్తు.. ఛార్జి డబ్బులు చేతిలో పెట్టి వెళ్తుంది. ఆ తర్వాత అపర్ణ హాల్లో కూర్చొని బుక్ చదువుతుంటే.. తనకి ఛాతిలో నొప్పి లేస్తుంది. అది గమనించిన సుభాష్ దగ్గరకి వస్తుంటే వద్దని అపర్ణ అంటుంది. సుభాష్ వెళ్లి రాజ్ ని తీసుకొని వస్తాడు. రాజ్ అపర్ణ దగ్గరికి వస్తాడు. సుభాష్ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు.