English | Telugu

Guppedantha Manasu : మను రాకతో ఉప్పొంగిన వసుధార.. రిషిని మర్చిపోతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1038 లో... నీ భర్త ఎవరని అనుపమని పదే పదే అడిగినా.. ఆమె నిజం చెప్పడం లేదు. కనీసం మనుకి వాళ్ల నాన్న పేరు తెలుసా? అని అడిగానని శైలేంద్రతో దేవయాని అంటుంది. అవునా అని శైలేంద్ర అనగానే.. మనుకి వాళ్ల నాన్న పేరు తెలియనట్టే కదా.. దాని గురించే అనుపమని గుచ్చి గుచ్చి అడుగుతుంటే అనపమ కళ్లలో నీళ్లు తిరగడం చూశానని, ఆ కన్నీళ్లలో ఆవేదన ఉందని దేవయాని అంటుంది. అయితే ఇదే మన ఆయుధం మమ్మీ.. మామూలు ఆయుధం కాదు వజ్రాయుధం.. ఇక నుంచి ఆ మను గాడ్ని ఎలా ఆడుకుంటానో చూడని దేవయానితో శైలేంద్ర అంటాడు. శభాష్ నాన్నా.. నువ్వు అదే పనిలో ఉండు.. నేను నా పనిలో ఉంటానని దేవయాని అంటుంది. ఇక అనుపమ దగ్గరకు వెళ్లిన ఏంజిల్.. అత్తయ్య మీరు పైకి కోపంగా ఉన్న.. లోపల మాత్రం మనుపై ఇష్టాన్ని చూపిస్తున్నారు. అది మీ కళ్లలో తెలుస్తుంది. మీతో పాటు మా బావతో కలిసి భోజనం చేసినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది.. ఆ హ్యాపీ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండాలనే సెల్ఫీ తీసుకున్నాం కదా.. ఆ సెల్ఫీ నువ్వు చూడలేదు కదా.. చూపించనా అని అనుపమని ఏంజిల్ అడుగుతుంది. ఏం అవసరం లేదని అనుపమ అంటుంది‌.

ఆ తర్వాత వసుధార వచ్చి.. మను గారు మళ్లీ కాలేజ్‌కి రావాలి మేడమ్ అని అనుపమని వసుధార అడుగుతుంది. ఆ మాటతో అనుపమ షాక్ అవుతుంది. దాంతో అక్కడే ఉన్న ఏంజిల్.. అంటే మను కాలేజ్‌కి రావడం లేదా? ఎందుకు రావడం లేదని అనుపమ అనడగడంతో.. మనుని తన్ని తరిమేసిన విషయాన్ని పూస గుచ్చినట్టు ఏంజిల్ కి చెప్తుంది. హో అంత జరిగిందా అని ఏంజిల్ అంటే.. అవును ఏంజిల్.. అందులో మను గారి తప్పేం లేదు. అదంతా రాజీవ్ చేసిన కుట్ర అని తేలింది.. అందుకే మను తిరిగి కాలేజ్‌కి రావాలని వసుధార అంటుంది. ఆ మాటతో అనుపమ.. ఏ మను కాలేజ్‌కి తిరిగి రాకపోతే ఏమౌతుంది? ఇంతకు ముందు అతను లేకుండా కాలేజ్‌ని నడిపారు కదా అని అంటుంది. అవును మేడమ్.. నడిపాం కానీ మన కాలేజ్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మను గారే కదా కాపాడింది. పైగా ఆయన కాలేజ్‌ డైరెక్టర్ కూడా అని వసుధార అంటుంది. కష్టకాలంలో కాపాడితే.. ఇప్పుడు కూడా ఉండాలా అని అనుపమ అనగానే.. మీరు చెప్పింది కరెక్టే మేడమ్.. కానీ మను గారు కాలేజ్‌ వదిలి ఎందుకు వెళ్లిపోయారంటే మనమేం సమాధానం చెప్పాలి? జరిగిన దాంట్లో మన తప్పు కూడా ఉందని వసుధార అంటుంది. సరే మీ ఇష్టమని అనుపమ చెప్తుంది. మరుసటి రోజు ఉదయం కాలేజీలో మను ఉంటాడు‌. శైలేంద్రని కలిసి మను వార్నింగ్ ఇస్తాడు. ‌ఇక మనుని కాలేజీలో చూసిన వసుధార ఉప్పొంగిపోతుంది.

ఏంటి మేడమ్.. ఫైల్ పట్టుకుని వచ్చారూ మళ్లీ గొడవ పడటానికా? నేను సంతకం చేస్తేనే మీరు సంతకం చేస్తారా? అని అంటాడు మను. దానికి నవ్వుకున్న వసుధార.. ‘నేను ఈ ఫైల్ గురించో.. సంతకం గురించో కాదు వచ్చింది.. మీరు మళ్లీ కాలేజ్‌కి వచ్చినందుకు థాంక్స్ చెప్పడానికి వచ్చానని వసుధార అంటుంది. రావాల్సి వచ్చింది మేడమ్.. కొందరి మాట కాదనలేనని మను అంటాడు. మీరే కాదు.. అమ్మ మాటని ఎవరు కాదనలేరని వసుధార అంటుంది. మీరు చాలా గ్రేట్ మేడమ్.. ఏదైనా అనుకుంటే సాధించేవరకూ వదిలిపెట్టరని మను అనగానే.. అవునండీ.. నేను అన్నీ సాధిస్తున్నాను కానీ రిషి సర్‌ ఎక్కడున్నారో తెలుసుకోలేకపోతున్నాను. సర్ కోసం వెతకని ప్లేస్‌ లేదు. అడగని మనిషి లేడని వసుధార అంటుంది. మీరేం బాధపడకండి మేడమ్.. రిషి సార్‌ని వెతికితీసుకొస్తానని మీకు మాట ఇచ్చాను... నేను అదే పనిలో ఉన్నాను.. రిషి సర్ ఖచ్చితంగా దొరుకుతారని మను అంటాడు. ఇంతలో అటెండర్ వచ్చి.. బోర్డ్ మీటింగ్‌కి అంతా వచ్చారు మేడమ్.. పిలుస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.