English | Telugu
సైబర్ కేటుగాళ్లు నిర్వాకంతో రెండు లక్షలు పోగొట్టుకున్న కీర్తి...
Updated : Mar 30, 2024
రోజురోజుకూ సైబర్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎలా మోసపోతున్నామో మనకే తెలీడం లేదు. ఇప్పుడు కీర్తి భట్ కూడా అలాంటి మోసానికే గురయ్యింది. ఒక్క క్లిక్ తో రెండు లక్షల్ని పోగొట్టుకుంది. ఇంతకు ఏమయ్యిందో చూద్దాం. ఈ వీడియో ఎంటర్ టైన్మెంట్ చేయడానికి కాదు ఇన్ఫర్మేషన్ కోసమే చేస్తున్నాం అని చెప్పారు కీర్తి, కార్తీక్ . తమ డబ్బుని ఒక్క లింక్ ద్వారా లాగేశారు సైబర్ నేరగాళ్లు అని చెప్పింది కీర్తి. ఒక కొరియర్ లింక్ రావడంతో. దాన్ని క్లిక్ చేసేసరికి అకౌంట్ నుంచి రెండు లక్షలు పోయాయి అని బాధపడింది. దీనిపై సైబర్ కంప్లైంట్ ఇచ్చాం. ఒక కొరియర్ రావాల్సి ఉంది అని దాన్ని ట్రాక్ చేస్తే మెహిదీపట్నంలో ఉందని ట్రాకింగ్‌లో చూపించింది.
ఆ తరువాత ఒక కాల్ వచ్చింది వాళ్లు హిందీలో మాట్లాడారు. మీకో కొరియర్ రావాలి కదా మీ లొకేషన్ , అడ్రస్ అప్డేట్ కావడం లేదు నార్మల్ నెంబర్ నుంచి హాయ్ అని పంపిస్తా.. దానికి రిప్లై ఇవ్వమని అడిగారు. వాళ్లు చెప్పినట్టే హాయ్ అని మెసేజ్ పెట్టాక ఒక లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసి వాళ్లు పంపిన వేరే నెంబర్‌కి ఫార్వర్డ్ చేయమన్నారు. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి.. దాన్ని ఓపెన్ చేశామని చెప్పారు. రూ.2 రూపాయిలు ఎక్స్ ట్రా పే చేయాల్సి వస్తుంది మేడమ్ అని వాళ్ళు చెప్పారు ఐతే రెండు రూపాయిలే కదా అని పంపించాను. తర్వాత యూపీఐ మెన్షన్ చేయమని అడిగేసరికి డౌట్ వచ్చి.. చేయనని చెప్పాను. అప్పుడు బ్యాంక్‌కి లింకైనా రిజిస్టర్ నెంబర్ ఇదేనా అని అడిగేసరికి అవునని చెప్పాను. వెంటనే నాకు ప్రాసెసింగ్ మెసేజ్ వచ్చింది. కాసేపు ఆగి కాల్ చేస్తాం.. అప్డేట్ ఇస్తాం అని వాళ్లు ఫోన్ కట్ చేసిన కాసేపటికి రెండు రూపాయిలు అకౌంట్ నుంచి కట్ అయ్యింది. రెండు రూపాయిలే కదా అని పట్టించుకోలేదు. ఆ తరువాత నేను షూటింగ్‌కి వెళ్లిపోయాను. సరిగ్గా.. 12 గంటలకు రూ.99వేలు కట్ అయ్యింది.. ఆ వెంటనే మళ్లీ మరో రూ.99 వేలు కట్ అయ్యింది. భయం వేసి వెంటనే బ్యాలెన్స్ చెక్ చేస్తే రెండు లక్షలు కట్ అయినట్టు చూపించింది. వెంటనే నాకు ఏం చేయాలో తెలియక.. కార్తీక్‌కి ఫోన్ చేసి ఆ తర్వాత 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేశాను. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇచ్చాం. వెంటనే నా అకౌంట్‌ని బ్లాక్ చేయించాను. ఆ కేటుగాళ్లు వేరే అకౌంట్ నుంచి ట్రాన్ ఫర్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇంతలో సైబర్ క్రైమ్ వాళ్లు యాక్షన్ తీసుకున్నారు. ట్రాకింగ్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని చెప్పారు. 90 శాతం డబ్బులు తిరిగి వస్తాయని అనుకుంటున్నాం. మా అకౌంట్‌లో కట్ అయిన రెండు లక్షలు ఒకే అకౌంట్‌కి వెళ్లలేదు. మొత్తం నాలుగు అకౌంట్‌లకు వెళ్లినట్టుగా సైబర్ క్రైమ్ వాళ్లు గుర్తించి.. అవి ట్రాన్స్ఫర్ కాకుండా హోల్డ్ చేసి వాళ్ళ అకౌంట్స్ ని బ్లాక్ చేశారు. ఇలాంటి సైబర్ క్రైమ్ నేరాలు మీకు జరగొచ్చు. ఒక్కోసారి ఏ లింక్ క్లిక్ చేయకపోయినా కూడా అమౌంట్ కట్ ఐపొతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అని చెప్పారు కార్తిక్, కీర్తి.